Begin typing your search above and press return to search.

పుష్ప‌కు రాజ‌మౌళి స‌లహా వ‌ర్క‌వుట్ కాలేదా?

By:  Tupaki Desk   |   18 Dec 2021 3:35 AM GMT
పుష్ప‌కు రాజ‌మౌళి స‌లహా వ‌ర్క‌వుట్ కాలేదా?
X
అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ తెర‌కెక్కించిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాపై తొలి నుంచి భారీ హైప్ నెల‌కొంది. బాహుబ‌లి 1.. బాహుబ‌లి 2 త‌ర‌హాలోనే ఈ సినిమా క‌థాంశాన్ని ఎక్స్ టెంట్ చేస్తూ సుకుమార్ భారీ ప్ర‌యోగ‌మే చేశారు. అయితే అత‌డు అలాంటి ప్ర‌యోగం చేయ‌డం వెన‌క ఎవ‌రున్నారు? అంటే దానికి సుక్కూనే ఆన్స‌ర్ ఇచ్చారు.

`పుష్ప` సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి కార‌ణం రాజ‌మౌళి. ఈ సినిమాని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళాలనే పట్టుదలతో ఉన్నది ఎస్.ఎస్.రాజమౌళి అని సుకుమార్ తెలిపారు. రాజమౌళి నన్ను పిలిచి భారతదేశమంతటా పుష్ప‌ను తీసుకెళ్లమని న కోరారు. అప్పటి వరకు మేము పాన్-ఇండియా విడుదలకు సిద్ధంగా లేము.

రాజ‌మౌళి ప్రోద్భ‌లం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అందుకే మేము దీనిని భారతదేశం అంతటా బ‌హుభాష‌ల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం`` అని సుకుమార్ అన్నారు.

అయితే పుష్ప విష‌యంలో తాము ఆశించిన‌ది ఒక‌టి. కానీ ఆరంభ స‌మీక్ష‌లు ప్రేక్ష‌కుల రివ్యూలు నిరాశ‌ప‌రిచాయి. సినిమాకి డివైడ్ టాక్ స్ప‌ష్ఠంగా ఉంది. బ‌న్ని వ‌న్ మ్యాన్ షో వ‌ల్ల‌నే ఈ సినిమా నిల‌బ‌డింద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.

నిజానికి పాన్ ఇండియా అనే హైప్ లేకుండా పార్ట్ 2 ఉంద‌ని అట్ట‌హాసంగా ప్ర‌చారం చేయ‌కుండా...ఒకే మూవీగా వ‌చ్చి ఉంటే సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చేదేమో! అని విశ్లేషిస్తు్నారు. పాన్ ఇండియా పార్ట్ 2 కూడా అన‌గానే సినిమాని డ్రాగ్ చేయాల్సొచ్చింది.

హైప్ పెరిగి అంచ‌నాలు చేర‌లేదని విశ్లేషిస్తున్నారు. రాజ‌మౌళి స‌ల‌హా ఇక్క‌డ వ‌ర్క‌వుట్ కాలేద‌ని భావించాలేమో! ఇక బాహుబ‌లి ని కూడా ఒకే సినిమాగా తీయాల‌నుకున్న రాజ‌మౌళి .. ఆ త‌ర్వాత నిర్మాత‌ల ఆలోచ‌నతో రెండు భాగాలుగా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రైట‌ర్ సాయిమాధ‌వ్ తో ఈ విష‌యంలో విభేధాలొచ్చాయ‌ని కూడా టాక్ వినిపించింది.

కానీ ద‌ర్శ‌క‌ధీరుడు రెండు భాగాలుగా బాహుబ‌లిని తెర‌కెక్కించి బంప‌ర్ హిట్లు కొట్టారు. వ‌ర‌ల్డ్ వైడ్ సెన్సేష‌న్స్ ని అందించారు. కానీ పుష్ప విష‌యంలో అలాంటి మ్యాజిక్ వ‌ర్క‌వుట్ కాలేద‌ని టాక్ వినిపిస్తోంది.

ఇక పుష్ప‌ సినిమాలో త‌గ్గేదే లే! డైలాగ్ గొప్పగా వ‌ర్క‌వుటైన సంగ‌తి తెలిసిందే. దానికోసం బ‌న్ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌యోగాలు చేశార‌ట‌. చివ‌రికి త‌గ్గేదే లే అంద‌రికీ క‌నెక్ట‌య్యింద‌ని సుకుమార్ తెలిపారు. అనుకోకుండా ఈ సంజ్ఞను క‌నిపెట్టాం.

బన్నీ ఒక ఫైట్ సన్నివేశం సమయంలో సెట్స్ లో ఉండగా అతను `తగ్గేదే లే` సంజ్ఞకు దగ్గరగా ఏదో చేయడం నేను గమనించాను. ఆ త‌రవాత దానిపై పని చేసాం. ఇది ఇప్పుడు పెద్ద హిట్ అయ్యింది అని సుకుమార్ వివరించారు. పుష్ప రిలీజ్ ముందు బిజీ షెడ్యూల్ వ‌ల్ల సుకుమార్ ప్ర‌మోష‌న్స్ కి ఎటెండ్ కాని సంగ‌తి తెలిసిందే.