Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఎందుకు పొడిగించినట్లు?
By: Tupaki Desk | 29 Nov 2018 4:57 AM GMTజూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19న హైదరాబాద్ శివార్లలో వేసిన ప్రత్యేక సెట్లో మొదలైన సంగతి తెలిసిందే. హీరోలిద్దరి మీద ఒక అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. రెండు వారాల ఈ షెడ్యూల్లో ముందుగా రామ్ చరణ్ షూటింగ్ ముగించుకుని రిలీవ్ కాబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ మాత్రం అనుకున్న దాని కంటే కొన్ని రోజులు ఎక్కువగానే షూట్లో ఉంటాడట. ఇది తారక్ ఉద్దేశపూర్వంగా ఏర్పాటు చేసుకున్న పొడిగింపు అని వార్తలొస్తున్నాయి. తారక్ అక్క సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమెకు మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడా చేయడా అన్న ఉత్కంఠ నెలకొంది.
ఐతే హరికృష్ణ మరణం తర్వాత ఆయన కుటుంబానికి ప్రాధాన్యమిస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చి సానుభూతి ఓట్లు పొందడానికి.. ఎన్టీఆర్ కుటుంబ అభిమానుల మద్దతు సంపాదించడానికి.. అలాగే ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లను ఫిక్స్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా సుహాసినిని బరిలోకి దించాడన్నది స్పష్టం. ఈ నేపథ్యంలో ఆమెకు మద్దతుగా ప్రకటన ఇస్తేనే ఎన్టీఆర్ అభిమానులు నొచ్చుకున్నారు. చంద్రబాబుకు లొంగాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఇన్నాళ్ల మాదిరే దూరం పాటించాలని మెజారిటీ ఫ్యాన్స్ సూచించారు. ఇలాంటి తరుణంలో ప్రచారానికి కూడా వెళ్తే చంద్రబాబు చేతిలో ఎన్టీఆర్ పావు అయిపోయాడన్న విమర్శలు వస్తాయి. ఈ నేపథ్యంలో నేరుగా ‘నో’ చెప్పకుండా బలమైన కారణం చూపించాలని భావించిన తారక్.. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ఉన్నందున తాను రాలేకపోతున్నానని చెప్పేందుకు గాను.. తన షెడ్యూల్ కొనసాగే ఏర్పాటు చేసుకున్నాడని అంటున్నారు.