Begin typing your search above and press return to search.
ముంబై మీడియాకు ఎన్టీఆర్ ఇచ్చిన ఆన్సర్ అదిరింది
By: Tupaki Desk | 10 Dec 2021 7:37 AM GMTరాజమౌళితో సినిమా అంటే ఎంతటి స్టార్ హీరోకైనా త్యాగాలు చేయక తప్పదు. అంతే కాకుండా ఆయనతో సినిమా అంటే కనీసం రెండు మూడేళ్లైనా కేటాయించాల్సిందే. ఆ టైమ్‌లో మరో సినిమా చేయడానికి.. డేట్స్ కేటాయించడానికి కూడా వీళ్లేదు.. వుండదు కూడా.. మరి అలాంటి టైమ్‌లో స్టార్‌లు దాదాపు రెండు మూడు ప్రాజెక్ట్‌లని పక్కన పెట్టాల్సి వుంటుంది. ప్రస్తుతం రాజమౌళితో `ఆర్ ఆర్ ఆర్` చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఇలాంటి పరిస్థితే తలెత్తిందా?.. రాజమౌళి కోసం ఆయన ఎన్ని సినిమాల్ని వదులుకున్నారు? .. అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదే ప్రశ్నని గురువారం ముంబైలో జరిగిన `ఆర్ ఆర్ ఆర్` ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ముంబై మీడియా ప్రశ్నించింది. దీనికి ఎన్టీఆర్ చెప్పిన సమాధానం అక్కడ నవ్వులు పూయించింది.ముంబైలో జరిగిన `ఆర్ ఆర్ ఆర్` ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో రామ్‌చరణ్ మినహా రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్, డీవీవీ దానయ్య, అజయ్ దేవ్‌గన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ అనంతరం మీడియా ఎన్టీఆర్‌పై పలు ఆసక్తికరమైన ప్రశ్నల్ని సంధించింది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. `ఆర్ ఆర్ ఆర్` కోసం దాదాపుగా మూడేళ్లు రాజమౌళికి కేటాయించారు. ఈ సమయంలో ఎన్ని చిత్రాలని వదులుకున్నారని ముంబై మీడియా ఎన్టీఆర్ ని ఈ సందర్భంగా ప్రశ్నించింది. దీనికి ఎన్టీఆర్ భలే స్మార్ట్‌గా స్పందించారు. నేను `ఆర్ ఆర్ ఆర్` ని పూర్తి చేయడంపైనే దృష్టిపెట్టాను.అంతే కాకుండా నేను రాజమౌళి సినిమా చేస్తున్నానంటే నాతో మరొకరు సినిమా చేయడానికి ముందుకొస్తారా? ` అని ముంబై మీడియాకే స్మార్ట్‌గా ఝలకిచ్చారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ చెప్పిన ఈ సమాధానం నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ఇదిలా వుంటే గురువారం విడుదల చేసిన ట్రైలర్ రోమాంచితంగా వుంది. గత కొన్ని రోజులుగా `ఆర్ ఆర్ ఆర్ ` నుంచి రావాల్సిన స్టఫ్ రావట్లేదని ఎదురుచూస్తున్న అభిమానులకు.. విమర్శకులకు ట్రైలర్ తో రాజమౌళి కావాల్సి నంత స్టఫ్‌ని అందించాడు. రెండు బొబ్బిలులు ఒకే సారి శతృ మూకపై పంజా విసిరితే ఎలా వుంటుందో... ఇద్దరు స్టార్‌లు చెలరేగి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తే ఏ స్థాయి విజువల్ ఫీస్ట్ గా వుంటుందో ట్రైలర్ తో సినిమా చూపించేశారు రాజమౌళి. దీంతో సినిమా పై నెలకొన్న కొన్ని అనుమానాలు ఈ దెబ్బతో పటాపంచలయ్యాయి. సినిమా వరల్డ్ వైడ్‌గా రికార్డుల మోత మోగించి తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచడం ఖాయంగా కనిపిస్తోందని అంతా సంబరాలు చేసుకుంటున్నారు.