Begin typing your search above and press return to search.
కొరటాలని ఎన్టీఆర్ కిడ్నాప్ చేస్తా అన్నారా?
By: Tupaki Desk | 28 April 2022 3:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం `ఆచార్య` మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం చిరు అబిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఎప్పడెప్పుడు థియేటర్లలోకి రానుందా? బాస్ ని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూడాలా? అని హై ఎక్స్ పెక్టేషన్స్ తో చూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పై భారీ అంచనాలున్నారు. ఈ దర్శకుడి నుంచి సినిమా వచ్చి దాదాపుగా నాలుగేళ్లవుతోంది. ఆయన అభిమానులు కూడా `ఆచార్య` రిలీజ్ కోసం చూస్తున్నారు.
సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ ప్రింట్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా `ఆచార్య` చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలని వెల్లడించిన ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా గురించి ఆశ్చర్యకర విషయాల్ని వెల్లడించారు. ఇది ఎన్టీఆర్ నటించనున్న 30వ చిత్రం కావడంతో దీన్ని పాన్ ఇండియా లెవెల్లో అత్యంత భారీ స్థాయిలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కొరటాల మార్కు కథతో తెలరపైకి రానుంది.
ఎన్టీఆర్ ప్రాజెక్ట్ గురించి అడిగిన ప్రశ్నకు కొరటాల శివ ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. తదుపరి ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాను. మరో వారం తరువాత దీని గురించి మాట్లాడతా. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ అని ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు మేము ఏమీ అనుకోలేదు. కథ లాక్ చేశాం. `ఆచార్య` అయిపోయాక ఎన్టీఆర్, నేను కలిసి కూర్చుని చర్చించుకుంటాం. `జనతా గ్యారేజ్` అప్పుడే అనుకున్నాం. ఇంత వరకు ఎన్టీఆర్ అన్ని చిత్రాలు ఒకే తరహాయే చేస్తున్నారని భావించి ఎన్టీఆర్ పాత్రని కొత్తగా రాసే ప్రయత్నం చేశాను.
ఎన్టీఆర్ స్ట్రెంత్ ఏంటో నాకు తెలుసు. ఈ సారి హైవోల్టేజ్ సినిమానే. నాకు పాన్ ఇండియా పదాలు.. ఆయన ముందు సినిమాల బ్యాగేజీలు నాకు వద్దు. మంచి కథ రాసుకున్నా..దాన్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తా. `పుష్ప -2` తరువాత బన్నీతో సినిమా వుంటుంది. ఎన్టీఆర్ పాపం నన్ను తన సినిమా విషయంలో డిస్ట్రబ్ చేయడం లేదు. `ఆచార్య` ఫినిష్ చేసుకుని వచ్చెయ్ నిన్ను కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోతా అంటున్నాడు.
మరో పది రోజుల్లో ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన చాలా వరకు ఆసక్తికర విషయాలన్నీ బయటపెట్టేస్తాం. ఎన్టీఆర్ తో చర్చించకుండా అన్నీ బయటికి చెప్పడం తప్పుకదా? . ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ఓ వేదిక అనుకున్న తరువాత దాని ద్వారానే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడించాలని అనుకుంటున్నాం. మే 21 ఎన్టీఆర్ పుట్టిన రోజు. అప్పుడే అన్నీ బయటికి వస్తాయి. అధికారికంగా అన్ని వెల్లడిస్తాం` అని చెప్పుకొచ్చారు కొరటాల శివ.