Begin typing your search above and press return to search.

ఆ రీమేక్ కు మన హీరోలు నో చెప్పారా?

By:  Tupaki Desk   |   7 July 2021 7:30 AM GMT
ఆ రీమేక్ కు మన హీరోలు నో చెప్పారా?
X
మలయాళంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కప్పెల సినిమా కు మంచి మార్కులు పడ్డాయి. గత ఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు క్లోజ్‌ చేశారు. ఆ సమయంలో కప్పెల సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేశారు. పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా రీమేక్‌ రైట్స్ ను తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్‌ మెంట్స్ వారు దక్కించుకున్నారు.

దాదాపుగా ఏడాది కాలంగా ఈ సినిమా రీమేక్ ను పట్టాలెక్కించేందుకు వారు ప్రయత్నాలు చేశారు. ఈ సినిమా కథ అనుసారంగా ఇద్దరు హీరోలు కావాల్సి ఉండగా ఒక హీరోగా సిద్దు జొన్నలగడ్డ ను ఎంపిక చేశారు. కాని రెండవ హీరో విషయానికి వచ్చేప్పటికి చాలా చర్చలు జరిగాయి. పలువురు హీరోల వద్దకు వెళ్లిన కప్పెల మేకర్స్‌ చివరకు ఒక తమిళ నటుడి వద్దకు వెళ్లి ఎంపిక చేశారు.

కప్పెల సినిమా షూటింగ్ నేడు లాంచనంగా ప్రారంభం అయ్యింది. త్రివిక్రమ్‌ చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ సినిమా లో ఒక హీరోగా మొదటి నుండి అంటున్నట్లుగా సిద్దు జొన్నలగడ్డను నటిస్తుండగా రెండవ పాత్రను అర్జున్ దాస్ ను ఎంపిక చేయడం జరిగింది. తమిళ సూపర్ హిట్‌ మూవీ ఖైదీ లో ఈయన నటించి మెప్పించాడు. ఆ సినిమాలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు. అందుకే ఈ సినిమాలో మరో హీరో పాత్రకు గాను ఆయన్ను ఎంపిక చేశారని అంటున్నారు.

ఈ సినిమాలో సిద్దు జొన్నల గడ్డ కాకుండా మరో హీరోగా ఒక యంగ్‌ తెలుగు హీరో దాదాపుగా ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి. కాని ఆయన చివరి నిమిషంలో తప్పకున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలుగు యంగ్‌ హీరోలు పలువురు కూడా ఈ ప్రాజెక్ట్‌ ను రిజెక్ట్‌ చేప్పారని అందుకే చివరి ప్రయత్నంగా తమిళ నటుడు అర్జున్‌ దాస్ ను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

కప్పెల ఒక మంచి సబ్జెక్ట్‌ కనుక మన తెలుగు హీరోలే చేస్తే మరింత బాగుండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సితార వారు తీసుకున్న కథ అవ్వడంతో పాటు త్రివిక్రమ్‌ సలహాలు మరియు సూచనలు ఈ సినిమాకు ఉంటాయి కనుక ఖచ్చితంగా సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఎవరైతే హీరోలు సినిమాకు నో చెప్పారో వారు ఖచ్చితంగా ఫీల్‌ అవ్వాల్సి వస్తుందంటున్నారు.

లాంచనంగా త్రివిక్రమ్‌ చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ సినిమాను అతి త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్ కు తీసుకు వెళ్లబోతున్నారు. విలక్షణ నటుడిగా పేరున్న సిద్దు తో పాటు అర్జున్ దాస్ కూడా కలవడంతో ఒక మంచి కాంబో అంటున్నారు. ఇక ఈ సినిమా కు హీరోయిన్స్ గా ఇద్దరు మలయాళి ముద్దుగుమ్మలు ఓకే అయ్యారనే టాక్‌ వినిపిస్తుంది. పూర్తి వివరాలు అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.