Begin typing your search above and press return to search.
ప్రభాస్ మూడోది కమిట్ అయ్యాడా ?
By: Tupaki Desk | 19 Jun 2019 8:53 AM GMTబాహుబలి తర్వాత బయటి నిర్మాతలకు అందని ద్రాక్షగా మారిన ప్రభాస్ ను తమ బ్యానర్ లో సినిమా ఒప్పించడానికి విశ్వప్రయత్నం చేస్తున్న వాళ్ళ నెంబర్ చెబితే గుండె ఆగిపోవలసిందే. ఇప్పటిదాకా సాహో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అయోమయం కొనసాగింది కాబట్టి కేవలం రాధాకృష్ణ దర్శకత్వంలో ఇంతకు ముందు ఇచ్చిన కమిట్ మెంట్ మేరకు మరో సినిమా ఒప్పుకున్నాడు కాని లేదంటే ఇంకా గ్యాప్ వచ్చేసేది.
ఇదిలా ఉండగా ఈ రెండు అయ్యాక ప్రభాస్ తో సినిమా చేసే లక్కీ ప్రొడ్యూసర్ ఎవరా అనే అనుమానం రావడం సహజం. లక్కీ ఎందుకంటే పైన చెప్పిన రెండూ ప్రభాస్ కు స్వంత బ్యానర్ లాంటి యువిలో రూపొందుతున్నాయి. సో ఇప్పుడు అవకాశం కొట్టే వాళ్ళు ఎవరైనా అదృష్టవంతులేగా
విశ్వసనీయ సమాచారం మేరకు ఆ అవకాశం దిల్ రాజు ఒళ్లోకొచ్చి వాలినట్టు తెలిసింది. అధికారికంగా తెలియలేదు కాని సాహో జరుగుతున్న టైంలోనే దిల్ రాజు ఓ స్క్రిప్ట్ గురించి వినిపిస్తే దానికి ఇంప్రెస్ అయిన డార్లింగ్ తప్పకుండా చేద్దాం అని మాటిచ్చాడట. ప్రభాస్ తో దిల్ రాజు గతంలో ఓ డిజాస్టర్ మున్నాను ఓ సూపర్ హిట్ మిస్టర్ పర్ఫెక్ట్ ని సమానంగా అందుకున్నారు.
అప్పటికి ఇప్పటికి ప్రభాస్ రేంజ్ లో ఇమేజ్ లో చాలా మార్పులు వచ్చాయి. పాతిక కోట్ల మార్కెట్ రెండు వందల కోట్లకు చేరుకుంది. మరి ఇలాంటి పరిస్థితిలో ప్రభాస్ ని ఎగ్జైట్ చేసేంత సబ్జెక్టు దిల్ రాజు ఏమి వినిపించారో. ఈయన సంగతి సరే కాని అసలు దర్శకుడు ఎవరై ఉంటారో అనేది భేతాళ ప్రశ్న. దీనికి సంబంధించిన క్లారిటీ ఇప్పట్లో రాదు కాని ఇంకో మూడు నాలుగు నెలలు వెయిట్ చేయాల్సిందే