Begin typing your search above and press return to search.
రానా డైరెక్టర్ పవన్ సినిమా మిస్ చేసుకున్నాడా?
By: Tupaki Desk | 21 Jun 2022 10:30 AM GMTరానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన భారీ మూవీ 'విరాటపర్వం'. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ మూవీ గత ఏడాది కాలంగా విడుదల పరంగా వరుసగా వాయిదాలు పడుతూఐ వచ్చింది. ఎట్టకేలకు ఈ జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన కలెక్షన్స్ మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం గమనార్హం. టాక్ బాగుతున్నా కానీ ఈ మూవీ కలెక్షన్స్ రోజు రోజుకీ తగ్గుముఖం పడుతూ ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
90వ దశకంలో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కించారు. ఇదిలా వుంటే ఈ చిత్ర దర్శకుడికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ రిలీజ్ కి ముందు దర్శకుడు వేణు ఊడుగుల స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఓ స్టోరీ లైన్ వినిపించారని, స్టోరీ నచ్చడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో కానీ లేదా మైత్రీ మూవీ మేకర్స్ లో కానీ చేయాలనుకున్నారట. అయితే ఇప్పటికే అంగీకరించి సెట్స్ పై వున్న ప్రాజెక్ట్ లని పూర్తి చేయడానికి పవన్ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వేణు ఊడుగుల తో పవన్ సినిమా చేయడం కష్టంగా మారింది. అంతే కాకుండా దసరా నుంచి పవన్ కల్యాణ్ ఏపీ వ్యాప్తంగా యాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు అంగీకరించిన సినిమాలు దసరా లోపు పూర్తి చేయాలని పవన్ ప్లాన్.
ఇలాంటి టైట్ షెడ్యూల్ లో వేణు ఊడుగుల సినిమాకు ఛాన్స్ లేదు. అతనికి డేట్స్ ఇచ్చే అవకాశం కూడా లేకపోవడంతో సినిమా చేయడం కష్టమని తేలిపోయింది. దీంతో పవన్ తో సినిమా చేసే అవకాశాన్ని వేణు ఊడుగుల డేట్స్ సమస్య కారణంగా వదులుకోవాల్సి వచ్చిందని ఇన్ సైడ్ టాక్.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్ట్ చేస్తున్న 'హరి హర వీరమల్లు' మూవీలో నటిస్తున్నారు. దీన్ని పూర్తి చేసి వెంటనే 'వినోదాయ సితం' రీమేక్ ని పట్టాలెక్కించాలని, ఆ తరువాత హరీష్ శంకర్ తో చేయబోతున్న 'భవదీయుడు భగత్' సింగ్ ని కూడా దసరాకు ముందే పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారట.
కానీ అది కుదిరేలా కనిపించడం లేదు. 'హరి హర వీరమల్లు'తో పాటు రీమేక్ మూవీ 'వినోదాయ సితం'ని పూర్తి చేసే అవకాశం వుంది కానీ 'భవదీయుడు భగత్ సింగ్' ని పూర్తి చేయడం మాత్రం కష్టమే అని తెలుస్తోంది. ఈ మూవీ పట్టాలెక్కాలంటే ఎలక్షన్స్ తరువాతే అని తెలుస్తోంది. మరి అంత వరకు హరీష్ శంకర్ ఎదురుచూస్తాడా? లేక మరో హీరోతో మరో ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.