Begin typing your search above and press return to search.
గీతలో రౌడీ లక్షణం అలా బయటికి!
By: Tupaki Desk | 8 Dec 2019 1:30 AM GMTకేవలం రెండే రెండు బ్లాక్ బస్టర్లతో స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకున్న ఏకైక కథానాయిక రష్మిక మందన. కన్నడ చిత్రం `కిరాక్ పార్టీ`తో వెలుగులోకి వచ్చిన ఈ చిన్నది టాలీవుడ్ లో నేడు అగ్ర కథానాయికగా రాజ్యమేలుతోంది. `ఛలో`- గీత గోవిందం- డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో తెలుగులో క్రేజీ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం నితిన్ తో `భీష్మ`... మహేష్ తో `సరిలేరు నీకెవ్వరు` చిత్రాల్లో నటిస్తోంది. అల్లు అర్జున్ సరసన సుక్కూ దర్శకత్వంలో ఛాన్స్ కొట్టేసింది.
ఇన్ని క్రేజీ చిత్రాలతో బిజీగా వున్న రష్మికకు బాలీవుడ్ `జెర్సీ` రీమేక్ లో నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చిందట. అయితే బాలీవుడ్ చిత్రం కోసం రష్మిక భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేసిందని.. ఆ కారణంగానే ఆ సినిమా రష్మికకు కాకుండా పోయిందని ప్రచారమవుతోంది. దీనిపై రష్మిక ఘాటుగానే స్పందించింది. భారీ పారితోషికం అంటే ఏంటో నాకు తెలియదు. సినిమా అంటే పారితోషికం మాత్రమే కాదు. ఒప్పుకున్న పాత్రని ఏమేరకు రక్తికట్టించగలమా లేదా అన్నది చూడాలి. నేను భారీ స్థాయిలో పారితోషికం ఆశిస్తున్నాను అన్నది కరెక్ట్ కాదు. నేను భారీగా డిమాండ్ చేయలేదు అని సూటిగానే చెప్పింది.
ప్రస్తుతం నేను నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాను. అంతకు మించి ఎక్కువ చిత్రాల్ని అంగీకరించేందుకు నేను సిద్ధంగా లేను. అందుకు నా శరీరం సహకరించాలి కదా?. పైగా ఇప్పుడు కమర్షియల్ చిత్రాల్లో మాత్రమే నటించాలని నిర్ణయించుకున్నాను. `జర్సీ`లోని పాత్ర సహజత్వానికి దగ్గరగా వుంటుంది. అలాంటి పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేను. అందుకే ఆ చిత్రాన్నివదులుకున్నాను` అని అసలు విషయం బయటపెట్టింది.