Begin typing your search above and press return to search.
కెజిఎఫ్ అ!లకు చూసే అవార్డు ఇచ్చారా ?
By: Tupaki Desk | 10 Aug 2019 2:30 PM GMTజాతీయ అవార్డులు ప్రకటించాక అందరి మదిలో మెదులుతున్న సందేహం ఇదే. కెజిఎఫ్ కన్నడ సినిమాకు మన అ! మూవీకి జాయింట్ గా బెస్ట్ విఎఫ్ఎక్స్ అవార్డు ఇచ్చాక అసలు గ్రాఫిక్స్ మీద అవగాహనా ఉండే జ్యురి సభ్యులు వీటిని డిసైడ్ చేస్తున్నారా అనే అనుమానం అందరిలోనూ మెదులుతోంది. కారణాలు లేకపోలేదు. అ!లో మరీ మైండ్ బ్లోయింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కడా ఉండవు. కేవలం ప్రియదర్శి ఎపిసోడ్ లో కొంత మేర ఉంటే అక్కడక్కడా అవసరానికి మేర దర్శకుడు తక్కువ స్థాయిలో వాడుకున్నాడు.
కథలో బలమంతా స్క్రీన్ ప్లే మీద ఆధారపడి మెప్పు పొందిన సినిమా ఇది. కెజిఎఫ్ విషయానికి వస్తే బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టి సెట్లు వేశారు తప్ప అంతా గ్రీన్ మ్యాట్ లో తీసిన సినిమా కాదు. కోలార్ బంగారు గనులను పునఃసృష్టి చేసిన క్రెడిట్ కూడా ఆర్ట్ డైరెక్టర్ కు వెళ్తుంది తప్ప గ్రాఫిక్స్ టీమ్ కు కాదు. మరి అలాంటప్పుడు వీటికి ఎందుకు ఇచ్చారు అనేదే భేతాళ ప్రశ్న. పైగా ఈ విభాగంలో బెంచ్ మార్క్ లాంటి మేకింగ్ చూపించిన 2.0 అసలు పట్టించుకున్న పాపాన పోలేదు.
సినిమా ఫలితం ఎలా వచ్చినా అందులోని విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి. రంగస్థలంలో సైతం కొన్ని కీలక సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ ఉపయోగించి న్యాచురల్ గా తీసిన ఫీలింగ్ వచ్చేలా టీమ్ చాలా కష్టపడింది. ఇవన్నీ చాలా లోతుగా పరిశీలించాల్సిన అంశాలు. ఈ కారణాల వల్లే సోషల్ మీడియాలో విజువల్ ఎఫెక్ట్స్ విభాగం పురస్కారాలపై మిశ్రమ స్పందన దక్కుతోంది. సరే ఇవైనా వచ్చాయి కదా అని సౌత్ సినిమా పరిశ్రమ సర్దుకుపోవడం తప్ప చేసేదేముంది