Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' పోస్టర్ ని ఆ సినిమాల నుంచి ఎత్తేసారా..?

By:  Tupaki Desk   |   26 Jan 2021 9:30 AM GMT
ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ ని ఆ సినిమాల నుంచి ఎత్తేసారా..?
X
దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం ''ఆర్.ఆర్.ఆర్''(రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా తారక్ - చరణ్ లకు సంబంధించిన ఓ ఫోటోను వదిలారు. ఇందులో చరణ్ గుర్రం మీద.. తారక్ బైక్ పై యుద్ధానికి బయలు దేరుతున్నట్లుగా చూపించారు. ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న ఈ పోస్టర్ వేరే సినిమా నుంచి తీసుకున్నారనే ఆరోపణలు రావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

'ఆర్.ఆర్.ఆర్' పోస్టర్ చూస్తుంటే హాలీవుడ్ మూవీ 'ఘోస్ట్ రైడర్: నుంచి తస్కరించారంటూ ఓ వర్గం వారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అలానే 'ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్' అనే యానిమేషన్ పోస్టర్ కి అనుకరణగా ట్రిపుల్ ఆర్ పోస్టర్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అసలు నీరు - నిప్పు కాన్సెప్ట్ కూడా ఇందులోనిదే అంటూ నెటిజన్స్ అంటున్నారు. ఇంటర్నెట్ - సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సీన్ కాపీ అని.. స్టోరీ దీనికి ఇన్స్పిరేషన్ అని.. సాంగ్ పలానా ట్యూన్ కి అనుకరణ అని పోస్టులు పెట్టడం ఈ మధ్య కామన్ గా జరుగుతోంది. 'ఆర్.ఆర్.ఆర్' టీజర్ పై కూడా ఇంతకముందు ఇలాంటి కాపీ ఆరోపణలే వచ్చాయి. దీంతో అభిమానులు అలాంటి ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్తూ.. అందులో ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదని.. రాజమౌళి విజన్ ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటుందని.. సినిమా విడుదల అయ్యాక తెలుస్తుందను కామెంట్స్ చేస్తున్నారు.