Begin typing your search above and press return to search.
సల్మాన్ ఖాన్ ఇష్టం లేకుండానే అంగీకరించాడా?
By: Tupaki Desk | 23 Sep 2022 10:09 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ యాక్షన్ ఇంటెన్స్ డ్రామా 'గాడ్ ఫాదర్'. 'బిగ్ బాస్' తరువాత చిరు డాన్ తరహా పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. మలయాళ రీమేక్ 'లూసీఫర్' ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు. అతిథి పాత్ర కోసం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని రంగంలోకి దించారు. ఇక కీలక పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారని తీసుకొచ్చారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. మోహన్ రాజా దర్శకత్వం వహించగా రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్, ఆర్.బి. చౌదరి నిర్మించారు.
'ఆచార్య' ఫ్లాప్ కారణంగా మెగా ఫ్యాన్స్ ముందు నుంచి 'గాడ్ ఫాదర్' విషయంలో ప్రతీ విషయాన్ని జాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పై ప్రశంసలు కురిపించిన ఫ్యాన్స్ ఆ తరువాత టీజర్ పై పెదవి విరిచారు. తమన్ అందించిన నేపథ్య సంగీతం కాపీలా వుందని తేలడంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఓ రేంజ్ లో నెట్టింట తమన్ ని ఆడుకున్నారు. ఇది మర్చిపోకముందే ఫస్ట్ సింగిల్ అంటూ రిలీజ్ చేసిన థార్ మార్ తక్కర్ మార్' కూడా ట్రోలింగ్ కి గురికావడం ఆసక్తికరంగా మారింది.
ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ లేదు.. గత సినిమాల్లోలాగా డ్యూయెట్ సాంగ్స్ అస్సలు లేవు. దీంతో స్పెషల్ పార్టీ సాంగ్ వుండాలని మేకర్స్ మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ లపై ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేశారు. దీనికి సాండీ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించగా.. ఈ పాటని స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా పర్యవేక్షణలో రూపొందించారు. ఇద్దరు బిగ్ స్టార్లతో ప్రభు దేవా పర్యవేక్షణలో స్పెషల్ సాంగ్ అనేసరికి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకున్నారు.
లిరికల్ వీడియో కోసం చిత్ర బృందం ప్రకటించిన తరువాత వారం రోజులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఆలస్యంగా రిలీజ్ చేసిన లిరికల్ వీడియో ఫ్యాన్స్ సహనాన్ని మరింతగా పరీక్షించింది. పాట సంగతి పక్కన పెడితే ఇద్దరు స్టార్లతో కలిసి ప్రభుదేవా చేసిన డ్యాన్స్ కంపోజింగ్ ట్రోలింగ్ కి గురైంది. భారీ స్థాయిలో ఊహించుకుంటూ ప్రభుదేవా ఉసూరుమనిపించాడని ఫ్యాన్స్ అతనిపై నెట్టింట దుమ్మెత్తిపోశారు.
ఇక ఈ పాటలో నటించిన చిరు తనదైన స్టెప్పులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే సల్మాన్ ఖాన్ మాత్రం అంటి ముట్టనట్టుగా.. పట్టీ పట్టనట్టుగా.. ఈ పాటలో .. సినిమాలో నటించడమే తనకు ఇష్టం లేనట్టుగా వ్యవహరించడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. ఫ్రెండ్షిప్ కోసం ఈ మూవీలో సల్మాన్ నటించాడని చిరు చెబుతున్నా ఎక్కడా సల్మాన్ లో ఆ ఛాయాలు, ఆసక్తి కనిపించకపోవడంతో ఇష్టం లేకుండానే బలవంతంగా అంగీకరించాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాటలోనే ఇలా వుంటే ఇక సల్మాన్ సినిమాలో ఎలా నటించాడా? అని అంతా ఆరా తీస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.