Begin typing your search above and press return to search.

నాని ఆఫర్ ని సామ్ రిజెక్ట్ చేసిందా..?

By:  Tupaki Desk   |   3 Nov 2021 4:30 PM GMT
నాని ఆఫర్ ని సామ్ రిజెక్ట్ చేసిందా..?
X
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నేచురల్ స్టార్ నాని ''దసరా'' అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇందులో మరో కీలకమైన పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సమంత సంప్రదిస్తున్నారని వార్తలు వచ్చాయి.

ఇప్పటికే నాని తో కలిసి రెండు సినిమాల్లో నటించిన సమంత.. ముచ్చటగా మూడోసారి నటించే అవకాశం ఉందని.. 'దసరా' లో కీ రోల్ లో యాక్ట్ చేయడానికి అంగీకారం చెప్పే యోచనలో ఉందని చెప్పుకున్నారు. ఇదే జరిగితే అక్కినేని నాగచైతన్య తో విడాకుల ప్రకటన తర్వాత సామ్ సైన్ చేసిన ఫస్ట్ తెలుగు ప్రాజెక్ట్ ఇదే అయ్యేది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం సమంత ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట.

ఆల్రెడీ మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకోవడంతో.. సెకండ్ లీడ్ హీరోయిన్ గా నటించడానికి సమంత సుముఖత వ్యక్తం చేయలేదట. అలాంటి చిన్న పాత్రకు తను అవసరం లేదని భావించిందట. దీంతో ఇప్పుడు మేకర్స్ ఈ పాత్ర కోసం మీడియం రేంజ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారని.. త్వరలోనే ఆ హీరోయిన్ పేరును ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది.

కాగా, 'దసరా' సినిమాతో సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలోని యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నాని గజదొంగ గా కనిపిస్తారని సమాచారం. హీరోహీరోయిన్లు ఇద్దరూ ఇందులో డీ గ్లామర్ రోల్స్ ప్లే చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'దసరా' అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంది. 'ఈ దసరా నిరుడు లెక్కుండది.. బాంచత్' అంటూ నాని తెలంగాణ యాసలో డైలాగ్ చెప్పారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు.