Begin typing your search above and press return to search.

'బాహుబలి' సిరీస్ లో శివగామి పాత్రను సామ్ రిజెక్ట్ చేసిందా..?

By:  Tupaki Desk   |   22 Jun 2021 2:30 AM GMT
బాహుబలి సిరీస్ లో శివగామి పాత్రను సామ్ రిజెక్ట్ చేసిందా..?
X
స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఇటీవల వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టి సత్తా చాటింది. 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత.. 'రాజీ' అనే ఎల్టీటీఈ సభ్యురాలి పాత్రలో నటించి మెప్పించింది. డీ గ్లామరస్ గా కనిపించిన సామ్.. యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టింది. ఈ ఒక్క సిరీస్ తో ఆమె నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా ఆఫర్స్ తో పాటుగా వెబ్ సిరీసుల కోసం సామ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓ సిరీస్ కోసం సమంతతో చర్చలు మొదలుపెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే 'బాహుబలి' సిరీస్ లో శివగామి పాత్ర కోసమే ఆమెను అప్రోచ్ అయినట్లు టాక్ నడుస్తోంది.

నెట్ ఫ్లిక్స్ సంస్థ 'బాహుబలి - బిఫోర్ ది బిగినింగ్' పేరుతో ఓ వెబ్ సిరీస్ చేయడానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. దేవ కట్టా - ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సిరీస్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కారణాలేంటో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. అయితే ఇప్పుడు నెట్‌ ఫ్లిక్స్ 'బాహుబలి' సిరీస్‌ ను పునరుద్ధరించాలని యోచిస్తోందని తెలుస్తోంది. నటీనటులతో సహా టీమ్ మొత్తాన్ని మార్చి చిత్రీకరణ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగానే సమంతను సంప్రదింపులు జరిపిట్లు చెప్పుకుంటున్నారు.

'బాహుబలి - బిఫోర్ ది బిగినింగ్' సిరీస్ లో శివగామి పాత్ర కీలకం. అందుకే ఆ పాత్ర కోసం సామ్ ని కాంటాక్ట్ అయ్యారట. దీని కోసం నెట్ ఫ్లిక్స్ భారీ పారితోషకం ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారట. అయితే సమంత మాత్రం ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. రమ్యకృష్ణ నటించి మెప్పించిన శివగామి పాత్రలో నటిస్తే కంపేరిజన్ వస్తుందనో లేదా మరేదైనా ఇతర కారణాలతోనో సమంత శివగామి పాత్రను రిజెక్ట్ చేసిందని అనుకుంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.