Begin typing your search above and press return to search.
పెళ్లి చీరను వెనక్కి ఇచ్చేసిన సమంత..?
By: Tupaki Desk | 9 March 2022 3:30 PM GMTఅక్కినేని నాగచైతన్య- సమంత జంట విడిపోతున్నట్టు ప్రకటించి బిగ్ షాక్ ఇచ్చారు. విడాకుల ప్రకటన అనంతరం ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. వీరిద్దరూ పలు ప్రాజెక్టులతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు.
తాజా గుసగుస ప్రకారం.. సమంత తన పెళ్లి చీరను అక్కినేని కుటుంబానికి వెనక్కి ఇచ్చేసిందని గుసగుస వినిపిస్తోంది. ఇటీవల పెళ్లి చీర సహా చైతన్యకు చెందిన వస్తువులను తిరిగి ఇచ్చేసింది. ఆ జ్ఞాపకాలను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తోంది.
నాగచైతన్య- సమంత జంట కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాగించారు. ఎనిమిదేళ్ల ప్రేమ షికార్ల అనంతరం పెద్దలను ఒప్పించి పెళ్లిగా మార్చారు. 2017లో గోవాలోని ఓ రిసార్ట్ లో పెళ్లి చేసుకున్నారు. ఇది అత్యంత అందమైన డెస్టినేషన్ వెడ్డింగ్. పెళ్లి వేళ... సమంత నాగ చైతన్య అమ్మమ్మ చీరను కట్టుకుంది. ఆమె ఇప్పుడు చైతన్య కుటుంబానికి ఆ చీరను తిరిగి ఇచ్చేసిందిట.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. నాగచైతన్య ప్రస్తుతం థాంక్యూ అనే సినిమాతో పాటు వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నారు. అమీర్ తో కలిసి నటించిన `లాల్ సింగ్ చద్దా` విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు సమంత రూత్ ప్రభు ఇటీవలే `పుష్ప: ది రైజ్`లో కనిపించారు. ఊ అంటావా ఊ ఊ అంటావా పాటతో ఒక ఊపు ఊపారు.
అలాగే గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం విడుదల కానుంది. శ్రీదేవి మూవీస్ సినిమా యశోద సెట్స్ పై ఉంది. యశోద చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. తన పాత్ర సమంత పాత్రతో సమానంగా ఉంటుందట.
ఈ చిత్రం 2022 వేసవిలో తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ- హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఆదిత్య 369- సమ్మోహనం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అటు రాజ్ అండ్ డీకేతోనూ పలు వెబ్ సిరీస్ లకు సంతకాలు చేసింది.
12 ఏళ్ల కెరీర్ జర్నీ వైభవంగా..!
నేటి పోటీవాతావరణంలో నిలదొక్కుకుని అగ్ర నాయికగా హోదాను కాపాడుకోవడం అంటే ఆషామాషీ కాదు. పైగా నేటి ప్రేక్షకులు ఎప్పటికప్పడు కొత్తందాల్ని కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ర్యాంప్ నుంచి నేరుగా రంగుల ప్రపంచంలో అడుగుపెట్టే భామలకు కొదవేమీ లేదు.
ఇలాంటి కాంపిటీషన్ లోనూ అన్ని సవాళ్లను అధిగమించింది సమంత రూత్ ప్రభు. తనదైన ప్రతిభతో పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా ఫ్లాపులు ఎదురైనా ప్రతి సందర్భాన్ని ఎంతో ఓర్పుగా నేర్పుగా ఎదుర్కొంది. తెలివైన ప్రణాళికలతో తనని తాను నిలబెట్టుకుంది.
మొత్తానికి వ్యక్తిగత జీవితంలో కలత నుంచి కూడా బయటపడుతోంది. ఇటీవల వరుస సినిమాలతో సమంత బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. అటు జాతీయ స్థాయిలో వెబ్ సిరీస్ లు సినిమాలపైనా దృష్టి సారించింది.
సమంత కెరీర్ ఈ ఏడాదితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏమాయ చేశావే చిత్రంతో సరిగ్గా 12ఏళ్ల క్రితం టాలీవుడ్ కి పరిచయమైన సమంతకు ఈ జర్నీ ఎంతో ఉద్విగ్నమైనది.