Begin typing your search above and press return to search.
శర్వా సినిమాకు అదే కలిసి వచ్చిందా?
By: Tupaki Desk | 10 Sep 2022 5:41 AM GMTవిభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు హీరో శర్వానంద్. అయితే ఎంత కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తున్నా గత కొంత కాలంగా శర్వాని సరైన సక్సెస్ వరించడం లేదు. అప్పుడెప్పుడో మారుతి రూపొందించిన 'మహాను భావుడు' సినిమాతో సక్సెస్ ని సొంతం చేసుకున్న శర్వానంద్ మళ్లీ అరేంజ్ హిట్ ని సొంతం చేసుకోలేకపోయాడు. ప్రతీ సినిమా కొత్తగా చేయాలని ప్రేక్షకులని మెప్పించాలని శర్వా చేసిన ప్రతీ ప్రయత్నం విఫలం అవుతూ వచ్చింది.
ఈ క్రమంలో కొత్త కథలతో శర్వా నటించిన దాదాపు ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. తీవ్ర నిరాశకు గురిచేశాయి. దీంతో ఆలోచనలో పడిన శర్వా చాలా రోజుల తరువాత తమిళ, తెలుగు భాషల్లో మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
శర్వానంద్ నటించిన లేటెస్ట్ బైలింగ్వల్ మూవీ 'ఒకే ఒక జీవితం'. ట్రైమ్ ట్రావెల్ కథతో రూపొందిన ఈ మూవీపైనే శర్వా భారీ ఆశలు పెట్టుకున్నాడు. దీంతో ఎలాగైనా మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలని విశ్వప్రయత్నాలు చేశాడు.
మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో హృద్యమైన ఎమోషనల్ జర్నీగా సాగిన ఈ మూవీని శ్రీకార్తీక్ తెరకెక్కించాడు. డ్రీమ్ వారియర్ ఫిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీ కిలీజ్ ఆలస్యం అవుతూ ఎట్టకేలకు సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు తొలి షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ మొదలైంది. ప్రత్యేకంగా సపెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన ప్రీమియర్స్ నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ మొదలైంది.
ఆడియన్స్, క్రిటిక్స్, సెలబ్రిటీస్ ఇలా అన్ని వర్గాల నుంచి ఈ మూవీకి యునానిమస్ గా పాజిటివ్ టాక్ రావడంతో ఉదయం ఆట నుంచే సినిమా పుంజుకోవడం మొదలు పెట్టింది. మార్నింగ్ కొంత స్లోగా మొదలైన పికప్ ఈవినింగ్ వరకు జోరందుకుంది.
టాక్ ని బట్టి ట్రేడ్ వర్గాలు వీకెండ్ కి సినిమా మరింతగా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా వున్నాయిన చెబుతున్నారు. కొత్త దర్శకుడైనా శ్రీకార్తీక్ సినిమాని అద్భుతంగా తీర్చి దిద్దిన తీరు, శర్వా నటన సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.