Begin typing your search above and press return to search.
స్టార్ హీరో తమ్ముడి మత మార్పిడికి కారణం ఇదేనా
By: Tupaki Desk | 8 March 2019 2:12 PM GMTతమిళ స్టార్ హీరో శింబుకు బ్యాడ్ బాయ్ పేరుంది. ఆయన మరియు ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదాస్పద అంశంతో మీడియాలో ఉంటూనే ఉంటారు. శింబు ప్రేమ వ్యవహారాలతో ఆమద్య తెగ హడావుడి చేయడంతో పాటు, అమ్మాయిలను చిన్న చూపు చూస్తాడని, సినిమాకు కమిట్ అయితే షూటింగ్ కు సరిగా రాడంటూ రకరకాలుగా శింబుపై ఆరోపణలు ఉంటాయి. ఇక ఆయన తండ్రి మీడియా ముందు గతంలో పలు సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యాడు. తాజాగా శింబు తమ్ముడు కురలరాసన్ వార్తల్లో నిలిచాడు.
కొన్ని రోజుల క్రితం శింబు తమ్ముడు కురలరాసన్ ముస్లీం మతంను స్వీకరించిన విషయం తెల్సిందే. ఆయన ముస్లీం మతంను స్వీకరించడాన్ని ఆయన తండ్రి మరియు కుటుంబ సభ్యులు కూడా సమర్ధించారు. తన కొడుకు అభిప్రాయాన్ని తాను గౌరవిస్తున్నట్లుగా టి రాజేందర్ చెప్పుకొచ్చాడు. ఉన్నట్లుండి ఎందుకు కురలరాసన్ మతం మారాడు అంటూ అందరు చర్చించుకున్నారు. ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. శింబు తమ్ముడి మతం మార్పిడి ప్రేమ కోసం అంటూ తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
కురలరాసన్ గత కొంత కాలంగా ఒక ముస్లీం యువతిని ప్రేమిస్తున్నాడని, ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు ముస్లీం మతంను స్వీకరించినట్లుగా చెబుతున్నారు. ఆ యువతి కుటుంబ సభ్యులు ముస్లీం మతం స్వీకరిస్తేనే పెళ్లికి అంగీకారం చెప్తామని ఖరాఖండీగా చెప్పడం వల్లే కురలరాసన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మతం స్వీకరించిన నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లోనే పెళ్లికి సంబంధించిన పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో కురలరాసన్ పెళ్లి చేసుకుంటానంటూ ఒకానొక సందర్బంలో మీడియా ముందు చెప్పుకొచ్చాడు. మతం మార్చుకున్నాడు కనుక త్వరలోనే ఆయన పెళ్లి ఉండవచ్చు అంటూ తమిళ సినీ వర్గాల వారు కూడా అంటున్నారు.