Begin typing your search above and press return to search.
'గాడ్ ఫాదర్' రేంజ్ ని తమన్ తగ్గించాడా?
By: Tupaki Desk | 6 Oct 2022 6:13 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'గాడ్ ఫాదర్' హిట్ తాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినిమాకి పబ్లిక్ టాక్ సహా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి మెగాస్టార్ దెబ్బకి బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయమంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య తో ఎదురైనా ప్లాప్ లెక్కలన్నింటిని గాడ్ ఫాదర్ సరి చేస్తాడని టాక్ వినిపిస్తుంది.
బాస్ నట విశ్వరూపానికి ప్రేక్షకాభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాతో దర్శకుడు మోహన్ రాజా అగ్ర దర్శకుల సరసన నిలబడటం ఖాయమంటూ కామెంట్లు పడుతున్నాయి. మొత్తానికి గాడ్ ఫాదర్ సౌండింగ్ అన్నిరకాలు గట్టిగానే వినిపిస్తుంది. అందరూ అన్ని రకాలు గా సమన్యాయం చేయడంతోనే గాడ్ ఫాదర్ ప్రేక్షకుల్లో నిలబడగలిగింది.
మరి సినిమాలో లోపాలేమైనా ఉన్నాయా? అంటే అంతా సంగీత దర్శకుడు థమన్ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. నేపథ్య సంగీతం పరంగా థమన్ విశ్వరూపం చూపినప్పటికీ మ్యూజికల్ గా సంగీత ప్రియులకు అంతగా కనెక్ట్ కాలేదని టాక్ వినిపిస్తుంది. థమన్ ఆ ఒక్క పని కూడా పర్పెక్ట్ గా చేసి ఉంటే గాడ్ ఫాదర్ నెక్స్ట్ లెవల్లో ఉండేదంటూ డీలా పడుతున్నారు.
సినిమాలోని 'థార్ మార్ ఠక్కర్ మార్' పాట మినహా మిగిలిన పాటలు ఏమంత కిక్ ఇవ్వలేదని ఫీడ్ బ్యాక్ వస్తుంది. రోలింగ్ క్రెడిట్స్ అస్సలు క్యాచీగా లేవంటున్నారు. టాలెంటెడ్ కంపోజర్ పాటలపై కూడా ఎక్కువ దృష్టి పెట్టి మరింత బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేదని అభిప్రాయపడుతున్నారు. 'భీమ్లా నాయక్' లాంటి సూపర్ హిట్ ఆల్బమ్ ఇస్తే గాడ్ ఫాదర్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి ఉండేదంటున్నారు.
త్రివిక్రమ్..బోయపాటి సినిమాలకు ఎలాంటి మ్యా జిక్ సంగీతం అందించారో? అదే మ్యాజిక్ చిరు విషయంలోనూ రిపీట్ చేసి ఉంటే? థమన్ రేంజ్ మరోలా ఉండేదంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అక్కడక్కడా కొన్ని కాపీ ట్యూన్స్ పడ్డాయని వినిపిస్తుంది. ఇలాంటివన్నీ రిపీట్ కాకుండా చూసుకుంటే థమన్ కి తిరుగుండదని మెజార్టీ వర్గం అభిప్రాయపడుతుంది.
ఈ విషయంలో చిత్ర దర్శకుడు మోహన్ రాజా ఇంకాస్త శ్రద్ద తీసు కుంటే థమన్ నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేదన్నది మరికొంత మంది అభిప్రాయం. అవన్ని పక్కనబెడితే థమన్ ఇప్పుడు శంకర్ సినిమాకి సంగీతం అందిస్తున్న సంగతి త తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ఆర్ సీ 15 కి థమన్ అనే సునామీ బాణీలు సమకూర్చుతున్నారు అన్నది గ్రహించాల్సిన విషయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.