Begin typing your search above and press return to search.
'బ్రహ్మాస్త్ర' కు అసలు టెస్ట్ మొదలైందా?
By: Tupaki Desk | 12 Sep 2022 10:34 AM GMTరణ్ బీర్ కపూర్, అలియా భట్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'బ్రహ్మాస్త్ర'. మన భారతీయ పురాణాల ఆధారంగా ఈ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ తో కలిసి మరి కొంత మంది ఈ మూవీని నిర్మించారు. రిలీజ్ కు ముందు నుంచి భారీ బజ్ క్రియేట్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే సినిమాపై వున్న బజ్ కారణంగా భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో తొలి రోజు భారీ స్థాయిలోనే ఈ మూవీ వసూళ్లని రాబట్టింది.
తొలి రోజు ఈ మూవీ భారీ స్థాయిలో ప్రారంభ వసూళ్లని రాబట్టింది. ఇండియా వైడ్ గా రూ. రూ. 35 కోట్లకు మించి వసూళ్లని రాబట్టినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా వైరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ. 75 కోట్లు రాబట్టి నట్టుగా చిత్ర వర్గాలు వెట్టడించాయి. ఎలాంటి హాలీడే లేని సమయంలో విడుదలైన ఈ మూవీ ఈ స్థాయి వసూళ్లని రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. వీకెండ్ కావడంతో ఈ మూవీ అవలీలగా రూ . 100 కోట్ల మార్కుని దాటడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
అయితే సోమవారం చిత్ర వర్గాలు ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.225 కోట్ల గ్రాస్ ని రాబట్టిందని ప్రకటించాయి. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి తొలి రోజు ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించినా వసూళ్లు మాత్రం ఆశాజనకంగా వుండటం విశేషం. టాక్ కు , వసూళ్లకు సంబంధం లేకుండా ఈ సినిమా వసూళ్లని రాబడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరగడం ఓ కారణం కాగా, వీకెండ్ కావడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా వుంటే 'బ్రహ్మాస్త్ర'కు అసలు టెస్ట్ మండే నుంచి మొదలైంది. ఈ రోజు భారీ వసూళ్లని రాబట్టగలిగితేనే ఈ సినిమా నిలబడుతుంది లేదంటే పినిమా బాక్సాఫీస్ వద్ద క్రమ క్రమంగా తగ్గుతూ వెళుతుంది. అది మండే తేలబోతుండటంతో మేకర్స్ ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగులో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడమే కాకుండా భారీ స్థాయిలో ప్రమోట్ చేయడంతో తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
ఇదిలా వుంటే ఇప్పటికే ఈ మూవీ హిందీలో రూ. 100 కోట్ల మార్కుని క్రాస్ చేయడంతో ట్రేడ్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా ఈ మూవీ మండే టెస్ట్ ని విజయవంతంగా పాస్ కావాలని ట్రేడ్ వర్గాలు నిషితంగా పరిశీస్తున్నారు. 'బ్రహ్మస్త్ర' మండే టెస్ట్ ని అవలీలగా అధిగమిస్తే ఇక బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి తిరుగు వుండదని అంటున్నారు. ఏం జరగనుదో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.