Begin typing your search above and press return to search.
అల్లుడు బ్రేక్ ఈవెన్ సాధించాడన్న బెల్లంకొండ
By: Tupaki Desk | 17 Jan 2021 9:16 AM GMTయంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. మాస్ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం `అల్లుడు అదుర్స్`. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా తొలి వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ సాధించిందని నిర్మాత బెల్లంకొండ సురేష్ తాజాగా సక్సెస్ మీట్ లో వెల్లడించారు.
పండుగ సీజన్లలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు ఎప్పడూ మంచి కలెక్షన్లు సాధిస్తుంటాయి. అల్లుడు అదుర్స్ తొలి మూడు రోజుల్లో అద్భుతమైన కలెక్షన్లు సాధించిందని బెల్లంకొండ వెల్లడించారు. సాయి శ్రీనివాస్ ని మించి.. ఇంటర్వెల్ ముందు సోను సూద్ ఇంట్రడక్షన్ కి క్లాప్స్ పడ్డాయని సక్సెస్ వేడుకలో అన్నారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ-``శాటిలైట్ హక్కులు సహా మొత్తం డిజిటల్ హక్కులు 21 కోట్లకు అమ్ముడయ్యాయి. మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం 10 కోట్లకు దగ్గరగా వసూల్ చేసింది. సినిమా బడ్జెట్ సుమారు 32 కోట్లు. ఈ చిత్రం ఇప్పటికే లాభాల జోన్లోకి ప్రవేశించింది``అని తెలిపారు.
చక్కని కాస్టింగ్ తో పాటు ఉత్తమ సాంకేతిక నిపుణులు దీనికోసం పనిచేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్.. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ప్రకాష్ రాజ్ - సోను సూద్ ఇతర ప్రముఖ తారాగణం. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుబ్రహ్మణ్యం.జి ఈ చిత్రాన్ని నిర్మించారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని అందించారు.