Begin typing your search above and press return to search.
విలక్షణ నటుడు దిగొచ్చినట్టేనా?
By: Tupaki Desk | 25 Oct 2019 6:51 AM GMTవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సీనియారిటీ గురించి చెప్పాల్సిన పనేలేదు. పరిశ్రమలో దశాబ్ధాల పాటు అగ్ర హీరోలందరి సినిమాల్లో నటించారు. అయితే కాలక్రమంలో ఆయనపై రకరకాల ఫిర్యాదులు పెరగడంతో నటుడిగా అవకాశాలు తగ్గాయి. ఆ క్రమంలోనే దర్శకుడిగానూ ఆయన చేయని ప్రయత్నం లేదు. ప్రస్తుతం ఇంకా ఆయన నటిస్తున్నారు అంటే ఆర్జన కోసం కాదు.. కేవలం ఉనికిని చాటుకునేందుకు మాత్రమే. కారణం ఏదైనా సీనియర్ అయిన ఆయనలో ఓపిక నశించిందని ఆ ప్రభావంతో సెట్లో గొడవ పడుతున్నాడని పరిశ్రమలో చర్చ సాగింది. అప్పట్లో ఆగడు సెట్స్ లో శ్రీనువైట్ల అసిస్టెంట్ తో గొడవ అయినా.. ఆ తర్వాత పలు ఇన్సిడెంట్స్ కూడా ఈ తరహా పరిణామాలే.
తాజాగా మీడియా వర్గాల సమాచారం ప్రకారం... అలాంటి పరిణామమే ఒకటి రూలర్ (బాలకృష్ణ 105) సెట్స్ లోనూ ఎదురైందట. ఓవైపు షాట్ కోసం ప్రకాష్ రాజ్ వెయిట్ చేస్తున్నారు. అయితే సీన్ లోకి రావాల్సిన భూమిక మాత్రం ఇంకా ప్రిపరేషన్ లో ఉన్నారట. దీంతో సహనం కోల్పోయిన ప్రకాష్ రాజ్ కాస్తంత గట్టిగానే అరిచారట. అంతా రెడీ అయ్యాక పిలవొచ్చు కదా అని నసిగారట. అయితే దానికి సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. 'ఇది మీ ఇల్లు కాదు.. ఓపిగ్గా ఉండాలి' అని పంచ్ వేశారట. ఆ సమయంలో బాలయ్య కూడా అక్కడే ఉన్నారు. ఆ రిప్లయ్ తో అహం దెబ్బ తిన్న ప్రకాష్ రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతారనే టీమ్ భావించింది. కానీ అతడు కూల్ అయ్యాడు. షాట్ పర్తి చేసి అప్పుడు వెళ్లారట.
మొత్తానికి అహంబ్రహ్మశ్మి.. అది ఇప్పటికి తగ్గింది. తన కోపమే తన శత్రువు అన్న నానుడిని గుర్తుంచుకుని చాలా జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుందని ప్రూవైంది... అంటూ ప్రస్తుతం మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య సరసన సోనాల్- వేదిక కథానాయికలు. ప్రకాష్ రాజ్- భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది. ఈనెల 26న టైటిల్ ని ప్రకటించనున్నారు. ప్రస్తుతం రూలర్ వర్కింగ్ టైటిల్ అని భావిస్తున్నారు.