Begin typing your search above and press return to search.

'అఖండ‌' కి ఫిలిం ఫేర్ అలా మిస్సైందా?

By:  Tupaki Desk   |   12 Oct 2022 12:30 AM GMT
అఖండ‌ కి ఫిలిం ఫేర్ అలా మిస్సైందా?
X
ప్ర‌తీ ఏటా జ‌రిగే ప్ర‌ఖ్యాత ఫిలింఫేర్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంతో ఘ‌నంగా ఈ ఉత్స‌వాల్ని నిర్వ‌హిస్తుంది. అన్నిభాష‌ల సినిమాల‌కు..న‌టుల్ని అవార్డుల‌తో సత్క‌రిస్తుంటారు. వివిధ కేట‌గిరిలో అవార్డులు అంద‌జేస్తుంటారు. అయితే ఈ ఏడాది అవార్డుల్లో అఖండ క‌చ్చితంగా ఫిలింఫేర్ ద‌క్కించుకుంటుంద‌ని అంతా భావించారు.

కంటెంట్..మ్యూజిక్ స‌హా అన్ని విభాగాల్లోనూ స‌క్సెస్ అయిన అఖండ‌కు ఫిలింఫేర్ అవార్డులు ద‌క్క‌డం ఖాయ‌మ‌ని నెట్టింట పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. కానీ అనూహ్యంగా ఫిలిం ఫేర్ అఖండ‌కి ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఏ ఒక్క విభాగంలోనూ అఖండ‌ని అవార్డుకు ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై అభిమానులు స‌హా విశ్లేష‌కుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌తిగా ఇదే వేదిక‌పై పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయి స‌క్సె స్ అయిన‌ పుష్ప ది రైజ్కి అవార్డు రావ‌డంతో మంట మ‌రింత చెల‌రేగుతోంది. ఇప్పుడీ రెండు సినిమాల‌కు ముడి పెట్టి నెట్టింట కొత్త ర‌కం ప్ర‌చారానికి తెర తీసారు. పుష్ప ..అఖండ క‌న్నా గొప్ప సినిమానా? బాల‌య్య‌...బ‌న్నీ పోటీకి దిగితే బాల‌య్య‌దే అప్ప‌ర్ హ్యాండ్ అవుతుంది.

కంటెంట్ ప‌రంగానూ రెండు సినిమాల మ‌ధ్య చాలా వ్య‌త్సాసం ఉంది. 'అఖండ' లో బాల‌య్య అఘోర పాత్ర పోషించి హిందు మ‌త‌త‌త్వ గొప్ప‌దనాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. బ‌న్నీ అడ‌వి సంప‌ద‌ను ఎలా దోపికి గురి చేయాలో చెప్పాడు? మ‌రి ఈ ఇద్ద‌రిలో అవార్డు ఎవ‌రికి ఇవ్వాలి. మంచి చెప్పిన‌వాళ్ల‌కి..చెడు చెప్పిన‌వాళ్ల‌కా? అంటూ బాలయ్య అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.

అలాగ‌ని బ‌న్నీని వ్య‌క్తిగ‌తంగా టార్గెట చేయ‌లేదు. ఫిలిం ఫేర్ నిర్వ‌హించేది హిదీ సంస్థ‌లు. కాబ‌ట్టి పుష్ప‌కి పాన్ ఇండియా కేట‌గిరిలో పెద్ద స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో అవార్డు ఇచ్చి ఉండొచ్చు. కానీ అదే స‌మ‌యంలో అఖండ‌ని హిందీ లో డ‌బ్ చేసి వ‌దిలితే సునామీ సృష్టించేది. బోయపాటి తీసుకున్న అఘోర పాత్ర గురించి హిందీలోనూ చ‌ర్చ‌కు దారి తీసింది.

ఇలా ఫిలిం ఫేర్ లెక్కించాల్సిన అంశాలు అఖండలోనూ చాలా ఉన్నాయి. కానీ నిర్వాహ‌కులకు అది ఎక్క‌డా క‌నిపించ‌లేదు. క‌నీసం క‌న్సిడ‌ర్ కూడా చేయ‌లేద‌ని అభిమానులు మండిప‌డుతున్నారు. అటు రాష్ర్ట ప్ర‌భుత్వాలు కొంత కాలంగా నంది అవార్డుల‌ను కూడా నిర్వ‌హించ‌లేదు. రెండు రాష్ర్టాల్లోనూ అదే ప‌రిస్థితి. నిర్వ‌హ‌ణ‌పై అదిగో ఇదిగో అని చెబుతున్నారు త‌ప్ప అవార్డులిచ్చి ప‌రిశ్ర‌మ‌ని ప్రోత్స‌హించింది లేదు. ఇటీవ‌లే ఈ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.