Begin typing your search above and press return to search.
హీరోయిన్ కి షాకిచ్చారా?. . అవమానించారా?
By: Tupaki Desk | 12 Feb 2022 6:45 AM GMTచియాన్ విక్రమ్ తన తనయుడు ధృవ్ విక్రమ్ తో కలిసి నటించిన చిత్రం `మహాన్`. కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. వాణి భోజన్ హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కనిపించింది. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ 2 గంటల 42 నిమిషాల నిడివితో సాగింది. అయితే ఇంత నిడివి వున్న ఈ మూవీలోని ఒక్క ఫ్రేమ్ లోనూ హీరోయిన్ వాణి భోజన్ కనిపించకపోవడంతో సినీ ప్రియులు షాక్ కు గురవుతున్నారు.
తమిళంలో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటున్న వాణి భోజన్ కు సంబంధించిన ఒక్క సీన్ అంటూ `మహాన్` లో కనిపించకపోవడం విడ్డూరంగా వుందంటున్నారు. సినిమా రిలీజ్ కు ముందు హీరో విక్రమ్ తో కలిసి వాణి భోజన్ రొమాన్స్ చేస్తున్న ఓ ఫొటోని విడుదల చేసిన మేకర్స్ సినిమాలో మాత్రం ఆమెకు చోటు కల్పించకపోవడం గమనార్హం. సినిమాలో కీ రోల్ అంటూ ప్రకటించిన మేకర్స్ అలాంటి కీలక పాత్రనే నిడివి ఎక్కువ అవుతోందని లేపేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వాణి భోజన్ కు సంబంధించిన సీన్ లని తొలగించడానికి ప్రధాన కారణం సినిమా నిడివి ఎక్కువ కావడమే నని, ఆ కారణంగానే ఆమె పాత్రకు సంబంధించిన సీన్ లని మొత్తం మేకర్స్ లేపేశారని అంటున్నారు. ఇలా చేయడం ఒక విధంగా ఆమెని అవమానించడమేనని, మరీ ఇంతగా ఓ హీరోయిన్ ని అవమానిస్తారా? అని హీరోయిన్ వాణి భోజన్ అభిమానులు `మహాన్` టీమ్ పై మండిపడుతున్నారు.
రివ్యూస్ చూసుకున్న హీరోయిన్ వాణి భోజన్ సినిమాలో తన పాత్ర ని తొలగించారని తెలుకుని షాక్ గురయిందట. 2 గంటల 42 నిమిషాల నిడివిగల సినమాలో తన పాత్రకు కనీసం ఒక్క సీన్ కు కూడా ఛాన్స్ ఇవ్వకపోవడం తనని అవమానించడమేనని హీరోయిన్ చిత్ర బృందం పై మండిపడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
విక్రమ్ వంటి బిగ్ హీరో చిత్రంలో నటించే అవకాశం లభించిందని పడిన సంబరం టీమ్ ఇచ్చిన షాక్ తో ఆవిరైపోయిందని, ఆమె బ్యాడ్ లక్ అని కొంత మంది కోలీవుడ్ మేకర్స్ పెదివి విరుస్తున్నారు. వాణీ భోజన్ తెలుగులో తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయమైన `మీకు మాత్రమే చెప్తా` చిత్రంతో పరిచయమైంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ మూవీ కూడా ఆమెకు చేదు అనుభవాన్నే మిగిల్చింది.