Begin typing your search above and press return to search.
హీరోయిన్ ...మాటల్ని కూడా అలా వదిలేశారేంటో?
By: Tupaki Desk | 5 Nov 2022 12:30 PM GMTఓటీటీ, డిజిటల్ మాధ్యమాల్లో మాత్రమే ఎలాంటి సెన్సార్షిప్ లేకుండా ఇంటిమేట్ సీన్ లు, వల్గర్ డైలాగ్ లు యధేశ్చగా వచ్చేస్తుంటాయన్నది అందరికి తెలిసిందే. కానీ ఈ మథ్య సినిమాల్లో కూడా 'ఎఫ్' వర్డ్స్ ని కూడా గ్రాంటెడ్ అని వదిలేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హీరోయిన్ పలికిన 'ఎఫ్' పదాలని కూడా లైట్ తీసుకుని విదలేయడం.. ఎలాంటి మ్యూట్ లేదా..కట్ విధించకుండా పర్మీషన్ ఇవ్వడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.
వివరాల్లోకి వెళితే... అల్లు శిరీష్ చాలా విరామం తరువాత నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'ఊర్వశివో రాక్షసివో'. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో కొత్త నిర్మాతలు ఈ మూవీని నిర్మించారు. టీజర్ తో షాకిచ్చిన ఈ మూవీ ఎలాంటి కంటెంట్ తో ఈ మూవీని నిర్మించారో.. ఎలాంటి సీన్ లతో నింపేశారో స్పష్టం చేసింది. ఇక ట్రైలర్ లోనూ మరింత మోతదుకు మించి లిప్ లాక్ సీన్ లని చూపించారు.
దీంతో ఈ మూవీపై సహజంగానే యూత్ ఆడియన్స్ కన్ను పడింది. కొంత మంది టాక్ ని బట్టి థియేటర్లకు వెళదామనుకుంటే మరి కొంత మంది టీజర్ తో టెమ్టైపోయి తొలి రోజు చూడాల్సిందే అని థియేటర్లకు వచ్చేశారు. టీజర్, ట్రైలర్ లతో కావాల్సినంత బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఫైనల్ గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు కాబట్టి ఈ మూవీకి సహజంగానే భారీ స్థాయిలో థియేటర్లు లభించాయి.
ఫస్ట్‌డే ఫస్ట్ షోకే టీమ్ అనుకున్న టాక్ బయటికి వచ్చేయడంతో శుక్రవారం సాయంత్రమే సెలబ్రేషన్స్ చేసకున్నారు. ఆది వారం లేదా సోమవారం గ్రాండ్ సక్సెస్ పార్టీకి ఏర్పాట్లు జరగుతున్నాయి. స్పెషల్ గెస్ట్ ని కూడా ఆహ్వానించబోతున్నారు.
ఇదిలా వుంటే అడల్ట్ కంటెంట్ తో ఇంటిమసీ సీన్ లు, లిప్ లాక్ ల సమాహారంగా తెరకెక్కిన ఈ మూవీలోని కొన్ని డైలాగ్ లని యుఎస్ ప్రింట్ లో యధేశ్చగా వదిలేయడం, కనీసం మ్యూట్ కూడా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఓ సీన్ లో మిడిల్ ఫింగర్ ని చూపించే సీన్ ని బ్లర్ చేశానే కానీ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ..కామెడీయన్ వెన్నెల కిషోర్ ని ఉద్దేశించి వాడే 'ఎఫ్' వర్డ్ 'ఎల్.. కొడకా' అనే పదాన్ని తొలగించలేదు.. మ్యూట్ కూడా చేయకపోవడం గమనార్హం. ఈ పదాన్ని విన్న వారంతా వెన్నెల కిషోర్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి బూతు పదాన్ని ఎలా అంగీకరించాడా? అని మండిపడుతున్నారు. ఇలా పేరున్న వారు నటించిన సినిమాల్లో ఇలాంటి డైలాగ్ లని ఎలా అనుమతిస్తున్నారని నెటిజన్లు తీవ్రంగా తిట్టిపోస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.