Begin typing your search above and press return to search.

హీరోయిన్ కెరీర్ ట్రాక్ తప్పినట్టేనా..?

By:  Tupaki Desk   |   10 Dec 2019 4:56 AM GMT
హీరోయిన్ కెరీర్ ట్రాక్ తప్పినట్టేనా..?
X
ఇండస్ట్రీ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టం. ఆఫర్లు సాధించడం కష్టం.. హిట్ సాధించడం ఇంకా కష్టం.. సక్సెస్ ను నిలబెట్టుకోవడం మహా కష్టం.. ఇలానే కెరీర్ ను ఏళ్ళ తరబడి కొనసాగించడం యమా కష్టం. ఇలా చేయాలంటే ఒక హీరోయిన్ కు గ్లామర్.. నటనతో పాటుగా కథల ఎంపికపై పట్టు ఉండాలి. ఏ సినిమాలకు నో చెప్పాలి.. ఏ సినిమాలకు యస్ చెప్పాలి అనే విషయాలు తెలిసి ఉండాలి. ఈ విషయాల్లో తప్పటడుగులు వేస్తే కెరీర్ లో ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ అలాంటి పరిస్థితి లోనే ఉందని టాక్ వినిపిస్తోంది.

డెబ్యూ సినిమా 'RX100' తో ఒక్కసారిగా గుర్తింపు సాధించింది పాయల్. ఈ తరం కథానాయికకు అవసరమైన ఘాటు నటన టన్నుల కొద్ది ఉండడంతో ఒక్క సారిగా ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయింది. ఆ సినిమా తర్వాత పాయల్ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని అంచనాలు వెలువడ్డాయి. అయితే పాయల్ సినిమాల సెలెక్షన్ అంతంత మాత్రమేనని 'RDX లవ్' తో అందరికీ అర్థం అయింది. కొన్ని సినిమాల్లో నటిస్తే పేరొస్తుంది.. కొన్ని సినిమాల్లో నటిస్తే ఉన్న పేరు కాస్తా పోతుంది. 'RDX లవ్' తో అదే జరిగింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పాయల్ 'వెంకీమామ' పైనే ఆశలు పెట్టుకుంది.

ఈ సినిమా లో పాయల్ వెంకటేష్ కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయితే పాయల్ కు కొన్ని ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది కానీ ఇందులో కూడా ఒక తిరకాసు ఉంది. ఒక్కసారి సీనియర్ స్టార్లతో నటించిన తర్వాత ఈ తరం హీరోలు ఆ హీరోయిన్లతో నటించేందుకు ఆసక్తి చూపించరు. నయనతార లాంటివారి విషయంలో ఎక్సెప్షన్ ఉందేమో కానీ మిగతా అందరి విషయంలో అలానే జరుగుతోంది. అలాంటప్పుడు 'వెంకీమామ' లో నటించడం పాయల్ కు రిస్కే. ఈ సినిమా హిట్ అయినా సీనియర్ స్టార్ల నుంచి అవకాశాలు దక్కుతాయేమో కానీ ఈతరం హీరోల సినిమా ఆఫర్లు కష్టమే. కెరీర్ ఆరంభం లోనే సీనియర్ స్టార్ తో నటించి పాయల్ తన కెరీర్ ను పాడు చేసుకుందని ఇప్పటికే ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.