Begin typing your search above and press return to search.
పవన్ లో పొలిటీషియన్ నిద్ర లేచాడా? నిర్మాతలకు కొత్త టెన్షన్
By: Tupaki Desk | 8 July 2021 3:30 AM GMTఎవరెన్ని చెప్పినా టాలీవుడ్ లో తిరుగులేని హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్న విషయం సెకండ్ వేవ్ కు కాస్త ముందు విడుదలైన వకీల్ సాబ్ మూవీ తేల్చేసింది. అందరూ చూసేసిన హిందీ ‘పింక్’ మూవీని.. రీమేక్ చేస్తే.. ఆ సినిమా విడుదల రోజున థియేటర్లు.. మల్టీఫ్లెక్సుల్లో ఎంతటి హంగామా క్రియేట్ అయ్యిందో తెలిసిందే. కరోనా దెబ్బకు థియేటర్లకుఏం వెళతామన్న భయాందోళనల్ని పక్కన పెట్టేసి మరీ.. చంటి పిల్లల్ని చంకల్లో వేసుకొని మరీ మోడ్రన్ అమ్మాయిలు సైతం సినిమా థియేటర్లకు బారులు తీరిన సీన్ చూస్తే.. పవన్ క్రేజ్ ఎంతన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. రాజకీయాలు వేరు.. సినిమాలు వేరన్న విషయంలో పవన్ ను అభిమానించే వారు ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తుంటారు.
ఇప్పటివరకు ఒక సినిమా తర్వాత మరొకటి. అది కూడా.. సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ లాంటివన్నీ పవన్ తోనే షురూ అయినవే. కాకుంటే.. తాను అనుసరించే మార్గాన్ని తానే మార్చేసుకున్న పవన్.. రోటీన్ కు భిన్నంగా ఒకేసారి నాలుగు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చేయటం ఆసక్తికరంగా మారింది. దీంతో.. ఆయన డేట్లు 2023 వరకు లేవని చెబుతారు. ప్రస్తుతం 40 శాతం షూట్ పూర్తి అయిన మలయాళంలో సంచలన విజయాన్ని సాధించిన ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రీమేక్ లో పాల్గొంటున్నారు. దగ్గుబాటి రానాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. కరోనా బారిన పడి కోలుకున్న ఆయన ఇటీవల ఈ సినిమా షూట్ లో పాల్గొన్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. రోజు గడిచేసరికి ఆయన ఏపీలో ఉండటం.. జనం మధ్య తిరుగుతుండటం ఆసక్తికర చర్చగా మారింది. ఓపక్క సినిమాలు ఒప్పుకొని మరోవైపు రాజకీయాల్లో బిజీ కావటం పలువురికి మింగుడుపడటం లేదంటున్నారు. పవన్ లోని రాజకీయ నాయకుడు నిద్ర లేచిన నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో నిర్మాతలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. అలాంటి వాదన మొత్తం పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే తప్పించి మరొకటి లేదంటున్నారు.
వకీల్ సాబ్ షూటింగ్ సమయంలో తన కమిట్ మెంట్ ఏమిటో చూపించిన పవన్..వరుస పెట్టి చాలా వేగంగా సినిమాను పూర్తి చేసినట్లు చెబుతారు. అంతేకాదు.. ఉదయం రాజకీయాలు.. రాత్రిళ్లు సినిమాలు చేస్తూ తీరిక లేని షెడ్యూల్ తో ముందుకు వెళుతున్నారని చెబుతున్నారు. ఇక.. నిర్మాతల ఆందోళన విషయానికి వస్తే..పవన్ గురించి.. ఆయన పొలిటికల్ ఎజెండా గురించి అవగాహనతోనే సినిమాలు చేస్తున్నందున.. సదరు నిర్మాతలు ఆందోళన చెందుతున్నారనే వార్తల్లో నిజం ఏమాత్రం లేదన్న మాట వినిపిస్తోంది.