Begin typing your search above and press return to search.

అసలు విషయాన్ని కవర్ చేయడానికే నిర్మాత రంగంలోకి దిగాడా..?

By:  Tupaki Desk   |   23 Sep 2022 3:41 AM GMT
అసలు విషయాన్ని కవర్ చేయడానికే నిర్మాత రంగంలోకి దిగాడా..?
X
టాలీవుడ్ లో ఇప్పుడు ఓ స్టార్ హీరో మరియు స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ క్రేజీ కాంబోలో ఇంతకుముందు వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలవడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఖచ్చితంగా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే గతంలో దర్శక హీరోల కలయికలో వచ్చిన జోనర్స్ కు వైవిధ్యంగా ఈ సినిమా రూపొందుతోంది.

గతేడాది అధికారికంగా ప్రకటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఇటీవలే సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తో చిత్రీకరణ ప్రారంభించారు. మోస్ట్ వాంటెడ్ ఫైట్ మాస్టర్స్ ఈ యాక్షన్ పార్ట్ ని పర్యవేక్షించారు.

అయితే ఆ యాక్షన్ ఎపిసోడ్ రషెస్ చూసి హీరో మరియు దర్శకుడు సంతృప్తి చెందలేదట. అలానే హీరోకి ఫైట్ మాస్టర్ల తీరు నచ్చలేదని.. ఈ క్రమంలో సృజనాత్మక వివాదాలు తలెట్టాయని టాక్ వచ్చింది. అందుకే ఈ నెలాఖరు వరకూ ప్లాన్ చేసిన షెడ్యూల్ ను రద్దు చేశారని రూమర్స్ వచ్చాయి.

అందుకే ఫైట్ మాస్టర్లు కూడా వెనక్కు వెళ్లిపోయారని అన్నారు. అయితే సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టడంతో నిర్మాత దీనిపై స్పందించారు. మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా ముగిసిందని పేర్కొంటూ.. ఫైట్ మాస్టర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఈ నేపథ్యంలో అసలు విషయాన్ని కవర్ చేయడానికే చిత్ర బృందం ఇలా ట్వీట్ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ యూనిట్ మాత్రం అదేమీ లేదని.. షూటింగ్ సక్సెస్ ఫుల్ గా జరిగిందని చెబుతోంది. తదితరులు షెడ్యూల్ కు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు.

ఇదిలా ఉంటే మాస్టర్స్ తో ఒక్క ఫైట్ మాత్రమే అనుకున్నారని.. అది ఫైర్స్ షెడ్యూల్ లోనే ముగించారని.. అందుకే వెనక్కి వెళ్లిపోయారనే కామెంట్స్ వచ్చాయి. కానీ ఇన్ సైడ్ టాక్ వేరుగా వుంది.

ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి దానికి తగ్గట్టుగా షూటింగ్ ప్లాన్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడేమో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల షెడ్యుల్ ని సడన్ గా క్యాన్సిల్ చేసారని అంటున్నారు. ఇలా అయితే చెప్పిన తేదీకి రావడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.