Begin typing your search above and press return to search.
యువ హీరోని క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పించారా..? తప్పుకున్నాడా..?
By: Tupaki Desk | 28 May 2021 3:30 PM GMTబాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ 'దోస్తానా 2' సినిమా నుంచి తప్పుకోవడం ఆ మధ్య హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ లో కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందుతున్న 'దోస్తానా-2' చిత్రం కోసం కార్తీక్ ఆర్యన్ కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే కార్తీక్ స్క్రిప్టు విషయంలో అభ్యంతరాలు చెప్పడం.. కాల్షీట్స్ కేటాయించకపోవడం వంటి మరేవో కారణాలతో అతణ్ని ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ వల్ల ఫ్యూచర్ లో కార్తీక్ తో సినిమాలు చెయ్యకూడదని డిసైడ్ అయ్యినట్టు ధర్మ ప్రొడక్షన్ సంస్థ ప్రకటించింది.
అయితే హీరో కార్తీక్ ఆర్యన్ కు ఇతర సినిమాల కమిట్‌మెంట్స్ ఉండటం.. లాక్ డౌన్ వల్ల కాల్షీట్ల సమస్య ఎదురవడంతో 'దోస్తానా' కు మరిన్ని డేట్స్ కేటాయించలేకపోయాడని కూడా అప్పట్లో అనుకున్నారు. ఇదే విషయం పై కంగనా రనౌత్ స్పందిస్తూ.. దివంగత సుశాంత్ సింగ్ మీద చేసినట్టే.. కార్తీక్ మీద కూడా అన్ ప్రొఫెషనల్ అని, డ్రగ్స్ అని రకరకాల కారణాలు చూపించి సినిమా నుంచి తీసేశారని, స్టార్ కిడ్స్ బ్యాచ్ ని మాత్రమే ప్రమోట్ చేస్తూ టాలెంట్ ఉన్న అవుట్ సైడర్స్ ని తొక్కేస్తున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయింది. ఇదిలావుంటే తాజాగా కార్తీక్ ఆర్యన్ మరో చిత్రం నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వార్తలు వస్తున్నాయి.
కార్తీక్ ఆర్యన్ హీరోగా అజయ్ బెహల్ దర్శకత్వంలో ''ఫ్రెడ్డీ'' అనే మూవీ తెరకెక్కుతోంది. షారుఖ్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ ప్రొడక్షన్ హౌస్ దీనిని నిర్మిస్తోంది. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ దాదాపు 2 ఏళ్ల క్రితమే సైన్ చేశాడట. అయితే డైరెక్టర్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఇప్పుడు కార్తీక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్నారని అంటున్నారు. దర్శకుడు ముందుగా చెప్పిన లైన్ కు, ఇప్పటి స్క్రిప్ట్ కు సంబంధం లేకపోవడంతో కార్తీక్ ఈ నిర్ణయానికి వచ్చాడని ఓ వర్షన్ వినిపిస్తోంది. ఇటీవల 'ధమాకా' అనే క్రైమ్ థ్రిల్లర్ లో నటించిన కార్తీక్.. మళ్ళీ అదే జోనర్ లో నటించలేనని 'రెడ్ చిల్లీస్'కు వివరించాడని.. అడ్వాన్స్ గా తీసుకున్న 2 కోట్ల రూపాయలను కూడా వెనక్కి ఇచ్చేశాడని టాక్.
అదే సమయంలో ఈ సినిమాకు సైన్ చేసేటపుడు అంతా ఓకే అని.. ఇప్పుడు స్క్రిప్టు విషయంలో కార్తీక్ అభ్యంతరాలు చెప్పడంతోనే మేకర్స్ అతన్ని తప్పిస్తున్నారని మరో వెర్షన్ ఉంది. 'ఫ్రెడ్డీ' నుంచి యువ హీరోని తప్పించారా లేదా తనే తప్పుకున్నాడా అనే దానిపై క్లారిటీ రావడంలేదు. కారణాలు ఏవైనా కార్తీక్ ఆర్యన్ ఇలా స్వల్ప వ్యవధిలో రెండు పెద్ద నిర్మాణ సంస్థల సినిమాల నుంచి దూరం కావడం బీ టౌన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.