Begin typing your search above and press return to search.
ఈ ఆర్ఆర్ఆర్ స్టార్.. న్యూ లగ్జరీ కారు ఆర్డర్ ఇచ్చాడా..??
By: Tupaki Desk | 2 March 2021 2:42 PM GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు లగ్జరీ కార్లు అంటే మక్కువ అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. మార్కెట్లోకి ప్రవేశపెట్టే ఏ కొత్త బ్రాండ్ కారు అయినా ఎన్టీఆర్ కొనుగోలు చేసేవాడు. అలాగే ఎన్టీఆర్ సంవత్సరానికి ఒక కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ తన కార్లను మార్చలేదు. అలాగే కొత్త కారు తీసుకున్న నివేదికలు కూడా లేవు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకమైన ప్రీమియర్ బ్రాండ్ కారును దిగుమతి చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేగాక విశ్వసనీయ వర్గాలు తెలిపిన నివేదికలను బట్టి ఇటలీ నుండి వచ్చిన మొట్టమొదటి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) లంబోర్ఘిని ఉరుస్ కారును ఎన్టీఆర్ ఆర్డర్ ఇచ్చాడట. భారత కరెన్సీలో దాని విలువ రూ.5 కోట్లు అని తెలుస్తుంది.
మానుఫాక్చర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. లంబోర్ఘిని ఒక సూపర్ స్పోర్ట్స్ కారు లాంటి ఎస్.యూ.వి ప్రాసెసర్ తో కలిపిన వరల్డ్స్ ఫస్ట్ సూపర్ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ ఇదే కావడం విశేషం. కారు విషయాలు చూస్తే.. 650 సివి, 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 4.0-లీటర్ ట్విన్ - టర్బో వి8 ఇంజిన్‌తో నడిచే ఉరుస్ 3.6 సెకన్లలో 0 నుండి 62 ఎమ్‌పిహెచ్ వేగవంతం చేస్తుంది. అలాగే 190 ఎమ్‌పిహెచ్ వేగంతో వెళ్ళగలదట. అంతేకాక లంబోర్ఘిని ఉరుస్ టోటల్ సర్ఫేస్ వెహికల్. ట్రాక్ నుండి ఇసుక, మంచు, కంకర నుండి రాళ్లవరకు ఏదైనా పసిగట్టే కెపాసిటీ దానికి ఉందట. నిజానికి ఇదొక పూర్తి ఆల్ రౌండ్ సూపర్ స్పోర్ట్స్ కారు అనే చెప్పవచ్చు. ఈ కారును ఇండియన్ హైవేస్ పై నడపడం అంత సులభం కాదు. ఎందుకంటే ఈ కారుకు ఎలాంటి గీతలు పడినా లక్షలు ఖర్చు అవుతుంది. అయితే ఈ లగ్జరీ కారును త్వరలోనే ఎన్టీఆర్ హైదరాబాద్ రోడ్లపై నడుపుతాడని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.