Begin typing your search above and press return to search.

కాలం అబ్బాస్ ను ఇలా మార్చిందా?

By:  Tupaki Desk   |   2 Jun 2021 3:30 AM GMT
కాలం అబ్బాస్ ను ఇలా మార్చిందా?
X
1996లో విడుదలైన 'ప్రేమదేశం' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్.. అప్పట్లో అమ్మాయిలకు కలల రాకుమారుడిగా మారిపోయాడు. బాయ్ ఫ్రెండ్ అంటే అలా ఉండాలి అని చెప్పుకునేవారు అమ్మాయిలు. ఇక, అబ్బాయిలకు ఆయన హెయిర్ స్టైల్ అంటే తెగ క్రేజ్. ఆ స్టైల్ చాలా కాలం కొనసాగింది.

అలా మొద‌లైన అబ్బాస్ కెరీర్ కూడా.. జోరుగానే కొనసాగింది. ఎన్నో మంచి మంచి సినిమాల్లో న‌టించాడు అబ్బాస్‌. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళంలో చాలా సినిమాలు చేశాడు. ఒక దశలో ఏడాదికి ఆరేడు సినిమాలు రిలీజ్ చేశాడు ఈ లవర్ బాయ్. తెలుగులో బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించాడు.

కానీ.. కొన్నేళ్ల తరవాత ఆయన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఆ తర్వాత చాలా కాలం ప్రముఖ యాడ్ లో కనిపించాడు. అయితే.. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన వెండి తెరకు దూరంగానే ఉంటున్నాడు. యాక్టింగ్ త‌న‌కు చాలా బోర్ కొట్టిందని, అందుకే నటనకు స్వస్తి చెప్పాన‌ని ఆ మ‌ధ్య చెప్పాడు అబ్బాస్. మనసు పెట్టలేనప్పుడు నటనకు న్యాయం చేయలేనని చెప్పుకొచ్చాడు.

మ‌రి, ఈ మాజీ హీరో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎక్క‌డ ఉన్నాడు? అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. ప్ర‌స్తుతం అబ్బాస్ మ‌న‌దేశంలో ఉండ‌ట్లేదు. న్యూజీలాండ్ లో స్థిర‌ప‌డ్డాడు. ఫ్యామిలీతో స‌హా అక్క‌డే ఉంటున్నాడు. అక్క‌డ ఏం చేస్తున్నాడ‌నేగా మీ సందేహం. ఇప్పుడు అబ్బాస్ ఓ మోటివేష‌న‌ల్ స్పీక‌ర్‌. ఇదే ప‌ని చేసుకుంటూ అక్క‌డే ఉంటున్నారు.

మ‌రో నాలుగు రోజుల్లో.. అంటే జూన్ 5లో ఆక్లాండ్ లో మోటివేష‌న‌ల్ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఆ దేశంలో క‌రోనా తీవ్ర‌త చాలా అంటే చాలా త‌క్కువ‌. అందుకే.. అక్క‌డ ఎలాంటి ఇబ్బందీ లేదు. మొత్తానికి సినిమాల‌కు శాశ్వ‌తంగా గుడ్ బై చెప్పిన అబ్బాస్‌.. అంద‌రికీ జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో చెబుతూ జీవిస్తున్నాడు.