Begin typing your search above and press return to search.
తెర వెనకుండి త్రివిక్రముడే నడిపించాడా?
By: Tupaki Desk | 21 Dec 2021 9:32 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కు మధ్య వున్న అనుబంధ గురించి అందరికి తెలిసిందే. ఈ ఇద్దరు మంచి స్నేహితులు. అంతే కాకుండా ఒకరి భావాలకు ఒకరు విలువిస్తుంటారు. అలాంటి త్రివిక్రమ్ .. పవర్ స్టార్ అభిమానులు ఫీలయ్యేలా చేశారట. ఆ కథ నంతా ఆయనే వెనకుండి నడిపించారట. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏమాకథ?.. పవన్ అభిమానులు ఫీలయ్యే పనిని త్రివిక్రముడే దగగరుండి నడిపించిన కథేంటీ? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వివరాల్లోకి వెళితే... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` ని సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ డేట్ కి `భీమ్లా .. రావడం కష్టమనే వాదనలు వినిపిస్తున్న వేళ నిర్మాత స్వయంగా రావడం పక్కా అంటూ ట్వీట్ చేశారు కూడా. అయితే మంగళవారం ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశారని, ఫిబ్రవరి 25న విడుదలవుతుందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల తరుపున దిల్ రాజు ప్రకటించడం పవన్ ఫ్యాన్స్ ని షాక్ కు గురిచేసింది.
అయితే `భీమ్లా.. వాయిదా కోసం నెల నుంచే కథ నడిచిందని, దీనికి కర్త కర్త క్రియ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ఆయననే ముందుండి ఈ సినిమాని వాయిదా వేయించాడన్నది ఇండస్ట్రీ వర్గాల విశ్వసనీయ కథనం. `RRR` జనవరి 7న విడుదలవుతున్న నేపథ్యంలో `భీమ్లా నాయక్`ని సంక్రాంతి రేస్ నుంచి తప్పించాలని దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య స్వయంగా త్రివిక్రమ్ ని కలిసి చెప్పారట.
అప్పటి నుంచే `భీమ్లా .. రిలీజ్ వాయిదాకు కథ మొదలైందని, అప్పటి నుంచి త్రివిక్రమ్ కు రాజమౌళి నిత్యం టచ్ లో వుంటూ వచ్చారని, పవన అందుబాటులో లేకపోవడం, ఆయన అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో ఈ సమప్యని త్రివిక్రమ్ ముందు పెట్టారట. పవన్ కల్యాణ్ క్రిస్మస్ వేడుకల కోసం విదేశాలకు భార్య తో కలిసి వెళుతున్నందున ఆయన వెళ్లిపోతే `భీమ్లా నాయక్` ని వాయిదా వేయడం కుదరదు అని భావించి ఆ భాధ్యతను త్రివిక్రమ్ కు అప్పగంచారట.
త్రివిక్రమ మాట పవన్ వింటారు అన్నది అందిరికి తెలిసిందే. దీంతో ఆయనే పవన్ ని ఒప్పించారట. దీంతో `భీమ్లా.. ని వాయిదా వేయడ చక చకా జరిగిపోయిందని, ఈ ఎంటైర్ ఎపిసోడ్ కి కర్త కర్మ క్రియ త్రివిక్రముడేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన వల్లే భీమ్లాని వాయిదా వేసి పవన్ ఫ్యాన్స్ కి షాకిచ్చారని చెబుతున్నారు.