Begin typing your search above and press return to search.
'శాకిని డాకిని' లో అలాంటి సీరియస్ ఇష్యూని డీల్ చేశారా..?
By: Tupaki Desk | 10 Sep 2022 1:30 PM GMTటాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రా మరియు నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం "శాకిని డాకిని". ఇది 'మిడ్ నైట్ రన్నర్స్' అనే సౌత్ కొరియన్ యాక్షన్-కామెడీ సినిమాకి అధికారిక తెలుగు రీమేక్. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్ - ట్రైలర్ హాస్యభరితంగా వినోదాత్మకంగా ఉన్నాయి. రెజీనా - నివేదా ఓ వైపు గ్లామరస్ గా కనిపిస్తూనే.. ఇంకోవైపు యాక్షన్ తో అదరగొట్టారు. ఇవి చూసి అందరూ ఇది యాక్షన్ తో కూడిన ఫన్ ఫిల్మ్ అని అనుకున్నారు. కానీ ఈ సినిమా అండ ఉత్పత్తి మరియు అద్దె గర్భం (సరోగసి) వంటి తీవ్రమైన సమస్యలను డీల్ చేస్తుందని టాక్.
ఇటీవల, ప్రభుత్వం సరోగసీ దుర్వినియోగాన్ని నియంత్రించడానికి నిబంధనలను జారీ చేసింది. సరోగసీ నియంత్రణ చట్టం-2021 కమర్షియల్ సరోగసీని నిషేధించింది. రీప్రొడక్టివ్ టెక్నాలజీ క్లినిక్స్ - రిప్రొడక్టివ్ టెక్నాలజీ బ్యాంక్లను నియంత్రించడం మరియు పర్యవేక్షించడం.. వాటి దుర్వినియోగాన్ని నిరోధించడం వంటివి లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పుడు 'శాకిని డాకిని' సినిమా ఇలాంటి ముఖ్యమైన సమస్య చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. ఇందులో హీరోయిన్లు ఇద్దరూ సరోగసీ ని దుర్వినియోగం చేసే అక్రమ ముఠాలను ఎలా ఛేదించారనేది చూపించబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ కామెడీతో పాటు ఒక పవర్ ఫుల్ మెసేజ్ ను ఇవ్వబోతున్నారట.
'శాకిని డాకిని' చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు U/A (యూ/ఏ) సర్టిఫికెట్ ను జారీచేసింది. సెప్టెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకి మిక్కీ ఎంసీ క్లియరీ సంగీతం సమకూర్చగా.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.
సురేష్ ప్రొడక్షన్స్ - గురు ఫిల్మ్స్ - క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై డి. సురేష్ బాబు - సునీత తాటి - హ్యూన్వూ థామస్ కిమ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గతంలో వీరు కొరియన్ చిత్రానికి రీమేక్ గా రూపొందించిన 'ఓ బేబీ' చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెజీనా కసాండ్రా మరియు నివేదా థామస్ లతో కలిసి 'శాకిని డాకిని' తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.