Begin typing your search above and press return to search.
ఐశ్వర్య నాకు 4సార్లు నో చెప్పింది: సూపర్ స్టార్
By: Tupaki Desk | 29 April 2020 8:30 AM GMTఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అగ్ర స్థాయి కథానాయిక ఇమేజ్ దక్కించుకున్న అందాల భామ ఐశ్వర్య రాయ్. బాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగిన ఈమె అడపాదడపా సౌత్ సినిమాల్లోనూ కనిపించింది. ప్రస్తుతం ఐశ్వర్య తనను హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేసిన మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో నటిస్తోంది. ఆయన దర్శకత్వం వహించిన 'ఇద్దరు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ఐష్. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఐశ్వర్యల కాంబినేషన్ పై ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. రజినీకాంత్ ఐశ్వర్య కలిసి రోబో సినిమాలో నటించారు. అయితే అంతకు ముందు నాలుగు సినిమాల్లో రజనీకి జోడిగా ఐశ్వర్యను సంప్రదించారట.
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్స్ నరసింహ, బాబా, చంద్రముఖి, శివాజీ సినిమాల్లో హీరోయిన్‌గా ముందు ఐశ్వర్య రాయ్‌నే సంప్రదించారు. అయితే ఐశ్వర్య మాత్రం ఆ సినిమాల్లో నటించేందుకు నో చెప్పింది. ఈ విషయంపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `నాతో సినిమా అని దర్శకులు వస్తే ముందు వడివేలు డేట్స్ తీసుకోమని చెప్పేవాడిని. ఎందుకంటే ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్. ఆయన డేట్స్ కన్ఫమ్ అయిన తరువాత నా డేట్స్ ఓకే చేసేవాడిని. ఆ తరువాత ఐశ్వర్య రాయ్ చేస్తుందో లేదో కనుక్కొండి అని అడుగుతా.. ఎందుకంటే ఆమెతో డ్యూయట్ చేయాలని నేను భావించాను. ముందుగా ఆమెను నరసింహా సినిమాలో నీలాంభరి పాత్రకు సంప్రదించాను.
తర్వాత చంద్రముఖి సినిమాలో జ్యోతిక చేసిన పాత్రకు కూడా ముందుగా ఐశ్వర్యనే అనుకున్నాం. జ్యోతిక అప్పుడు ముంబైలో ఉండేది. ఆ పాత్రకు న్యాయం చేయగలదా అనే అనుమానం నాకు ఉండేది. కానీ డైరెక్టర్ పి. వాసు నమ్మకంతో ఆమెను తీసుకువచ్చాడు. ఆ నమ్మకాన్ని జ్యోతిక నిలబెట్టింది` అని చెప్పాడు రజనీ. నాలుగు సినిమాలు రిజెక్ట్ చేసిన తరువాత చివరగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన రోబో సినిమాలో నటించేందుకు అంగీకరించింది ఐశ్వర్య. కానీ ఆమెను తప్పుబట్టే అవసరం లేదు. ఎందుకంటే డేట్స్ అడ్జస్ట్ కాక చేయలేకపోయిందట. ఆఖరికి మా కాంబినేషన్లో రూపొందిన రోబో సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే" అంటూ సూపర్ స్టార్ తెలిపారు.