Begin typing your search above and press return to search.
ఆశకి.. అత్యాశకి తేడా తెలిసిపోయిందా?
By: Tupaki Desk | 17 May 2022 11:30 AM GMTమన సినిమాకు భారీగా వసూళ్లు రాబట్టడాలనేది ఆశ.. కానీ అందినకాడికి ముందే గుంజేయాలన్నది నిజంగా అత్యతాశే అవుతుంది. టాలీవుడ్ అనేది బంగారు బాతులాంటిది. ఈ మధ్య స్టార్ ప్రొడ్యూసర్ లు, మేకర్స్ అత్యాశకు పోయి అదే బంగారు బాతుని ఉన్న ఫలంగా కోసేసుకని తినేద్దాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో మొదటికే మోసం అవుతోంది. దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు వున్నా ముందు సినిమాకు మేమున్నామంటూ ధైర్యంగా ముందుకొచ్చి తమ మద్దుతుని తెలిపింది తెలుగు ప్రేక్షకులే. ఇది చూసిప నార్త్ ఇండస్ట్రీ మన వాళ్లని ప్రశంసలల్లో ముంచెత్తింది.
కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్గీస్ మాత్రం మన వాళ్ల ప్రత్యేకతని గుర్తించకుండా అత్యాశకు పోతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ చిత్రాలకు అందిన కాడికి టికెట్ రేట్లు భారీగా పెంచేస్తూ సగటు సినీ ప్రియులకు సినిమాని భారంగా మార్చేస్తున్నారు. దీంతో మేకర్స్ తీసుకున్న నిర్ణయం సినిమాల పాలిట యమ పాశంగా మారుతోంది. కొన్ని చిత్రాలకు ప్రేక్షకులు థియేటర్లకు కూడా రాని పరిస్థితిని కలిగిస్తూ షాకిస్తోంది. ఈ రోజుల్లో సగటు సినీ అభిమాని ఫ్యామిలీతో థియేటర్లకు రావాలంటే దాదాపు అయ్యే ఖర్చు అక్షరాలా 2 వేల రూపాయలు.
ఇంత ఖర్చు చేసి ప్రతీ వారం ఫ్యామిలీతో థియేటర్లకు రావలంటే తను ఆస్తులు అమ్ముకోవాల్సిందే. దీంతో చాలా మంది ఓటీటీల బాట పడుతున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా కుదేలైన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. భారీ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ తో థియేటర్ల హౌస్ ఫుల్స్ తో కళకలలాడుతోంది. అయితే తాజాగా టికెట్ రేట్లపై తీసుకున్న నిర్ణయం ఇప్పడు టాలీవుడ్ చిత్రాలకు ఇబ్బందకరంగా మారుతోంది.
గత రెండేళ్ల విరామం తరువాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తుండటంతో టాలీవుడ్ వరుస షూటింగ్ లతో కొత్త శోభను సంతరించుకుంది. ప్రేక్షకుల్ని మరింతగా థియేటర్లకు రప్పించాలన్న ఆలోచనని పక్కన పెట్టిన మేకర్స్ తక్కువ రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవాలన్న అత్యాశకు పోతున్నారు. భారీగా టికెట్ రేట్లని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెంచేస్తూ సగటు సినీ అభిమాని సహనాన్ని పరీక్షిస్తున్నారు. పెంచిన టికెట్ రేట్లతో ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 లాంటి క్రేజీ చిత్రాలని చూడాలనుకుంటున్నారు. చూస్తున్నారు. కానీ అదే రేట్లకు ఆచార్య, సర్కారు వారి పాట లాంటి చిత్రాలని కూడా చూడాలంటే కుదరని పని అని స్పష్టంగా అర్థమైపోయింది.
ఒక నెలలో ప్రేక్షకులు మహా అయితే భారీ రేట్లకు సినిమా కున్న క్రేజ్ ని బట్టి థియేటర్లకొస్తారు. కానీ ప్రతీ సినిమాకు ప్రతీ వారం అదే రేట్లతో సినిమా చూడాలంటే చూడరని తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఈ రోజుల్లో ఫ్యామిలీతో సినిమా అంటే మాటలు కాదు. టికెట్ రేట్ల దగ్గరి నుంచి స్నాక్స్ వరకు తడిసిమోపెడవుతోంది. దాంతో సామాన్యుడు బాహుబలి, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 లాంటి క్రేజీ చిత్రాలకు మాత్రమే భారీగా ఖర్చు చేసి థియేటర్లకు రావాలనుకుంటున్నారే కానీ ప్రతీ సినిమాకు అదే స్థాయిలో ఖర్చు పెట్టడానికి సిద్ధం గా లేరు. ఓటీటీకి అలవాటు పడిన జనం ఇదే స్థాయిలో ఇండస్ట్రీ వర్గాలు ప్రతీ సినిమాకు టికెట్ రేట్లని పెంచేస్తే మొదటికే మోసం అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా అయినా దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ అర్థం చేసుకోవడం విశేషం. ఆయన తాజా నిర్ణయంతో ఆశకి.. అత్యాశకి తేడా తెలిసిపోయిందా?.. టాలీవుడ్ బిగ్గీస్ లో అంతర్మథనం మొదలైందా? అనే భావన కలుగుతోంది. దిల్ రాజు లో అంతర్మథనం మొదలైంది కాబట్టే ఆయన తన 'ఎఫ్ 3' చిత్రానికి టికెట్ రేట్లని హైక్ చేయమని అడగడం లేదు.. హైక్ చేయడానికి ఆసక్తిని కూడా చూపించడం లేదు. అందరు ప్రొడ్యూసర్ లు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సహసిస్తారు లేదంటే అంతా ఓటీటీ బాటపడతారు అప్పుడు థియేటర్లు మూతపడే స్టేజ్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయంలో అంతా ఆలోచిస్తారని సగటు సినీ అభిమాని కోరుకుంటున్నాడు.