Begin typing your search above and press return to search.
వెండితెరపై ఎంట్రీ ఇవ్వకముందు త్రిష సంగతి
By: Tupaki Desk | 6 Nov 2020 6:50 AM GMTఅందం అంటే త్రిష..ఆమె నవ్వితే ఆ బుగ్గ సొట్టకు క్యూట్ నెస్ కి పడిపోని కుర్రాడే ఉండడు. దక్షిణాది సినీయవనికపై రెండు దశాబ్ధాల సుదీర్ఘ కాలం త్రిష హవా సాగింది అంటే ఆ ట్యాలెంట్ గురించి అందం గురించి ప్రత్యేకించి చెప్పాల్సినదేమీ లేదు.
అంతటి అందం అసలు వెండితెరకు పరిచయమయ్యే ముందు ఎలా ఈ రంగంలో ప్రవేశించింది? అన్నది తెలిసింది తక్కువ మందికే. త్రిషకు నిజానికి కథానాయికగా ఎదిగేందుకు బాటలు వేసింది మాత్రం.. ఫల్గుని పాథక్ మ్యూజిక్ వీడియో అన్న సంగతి మీకు తెలుసా?
తెరపైకి అడుగుపెట్టేప్పటికి త్రిష వయసు కేవలం 18 సంవత్సరాలు. నటి అవ్వడం అన్నది తన ఆలోచన కానేకాదు. ఏదో అలా గాలివాటంగానే అప్రయత్నంగానే అదంతా జరిగిపోయింది. తమిళ - తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందిన అగ్ర కథానాయికగా హోదా సంపాదించడానికి ముందు తొలి అడుగు ఎంతో ఆసక్తికరమైనది. తనదైన అందం నటనతో లక్షలాదిగా అభిమానుల్ని సంపాదించుకోవడం త్రిషకే కుదిరింది అంటే ఫస్ట్ ఇంప్రెషన్ లోనే ఆ స్థాయిని అందుకుంది.
టాలీవుడ్ కోలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నాయికగా నటించింది. చిరంజీవి.. కమల్ హాసన్ .. నాగార్జున.. వెంకటేష్.. మహేష్ ..ఇలా టాప్ స్టార్లందరితో నటించింది. నవతరం హీరోలందరితోనూ జోడీ కట్టింది.
వీటన్నిటికీ ముందు ఫల్గుని పాథక్ మ్యూజిక్ వీడియో చార్ట్ బస్టర్ లో నిలిచిందన్నది అంతగా గుర్తుండకపోవచ్చు. మేరీ చునార్ ఉద్ ఉద్ జయే.. అంటూ తనదైన సుస్వరంతో ఫల్గుని పాథక్ గానమృతం ఇప్పటికీ ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. అందులో అందాల భామల్ని యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు.
ఇక ఇదే మ్యూజిక్ వీడియోలో ఆయేషా టాకియా కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ త్రిష స్థాయి ఎంతో.. అయేషా లెవల్ ఎంతో అందరికీ తెలిసినదే. వెండి తెరపైకి అడుగుపెట్టినప్పుడు త్రిష వయసు కేవలం 18 సంవత్సరాలు. నటిగా మారడం ఎప్పుడూ ఎంపిక కాదు. తాను క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలని కోరుకునేది. అయితే 1999 లో మిస్ సేలం.. మిస్ మద్రాస్ 2000.. మిస్ ఇండియా 2001 బ్యూటిఫుల్ స్మైల్ గెలుచుకున్న తరువాత.. త్రిష చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. ఆమె 2002 లో నాయికా ప్రధాన పాత్రతో నటిగా పరిశ్రమలోకి వచ్చింది. తమిళం తెలుగులో పెద్ద స్టార్ గా ఎదిగింది. ఆ జర్నీ గురించి తెలిసినదే.
2010 లో అక్షయ్ కుమార్ ఖట్టా మీతాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తమిళ సినిమాలోని సామి (2003) .. గిల్లి (2004) .. వర్షం (2004) వంటి విజయవంతమైన చిత్రాలతో పాపులారిటీ పెంచుకున్న త్రిషకు ఆ తర్వాత కెరీర్ పరంగా వెనుదిరిగి చూడాల్సిన పనే లేకుండా పోయింది.
ప్రస్తుత కెరీర్ సంగతి చూస్తే .. `పొన్నియిన్ సెల్వన్` కాకుండా.. రాంగి .. పరమపాదమ్ విలయట్టు తదితర చిత్రాల్లో నటిస్తోంది. మోహన్ లాల్ సరసన మాలీవుడ్ చిత్రం `రామ్` లో నాయికగా నటిస్తోంది.