Begin typing your search above and press return to search.

అరవ ఇస్మార్ట్‌ శంకర్‌ ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   28 Aug 2019 10:30 PM GMT
అరవ ఇస్మార్ట్‌ శంకర్‌ ఎవరో తెలుసా?
X
సక్సెస్‌ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న పూరి మరియు రామ్‌ లు కసితో చేసిన మూవీ 'ఇస్మార్ట్‌ శంకర్‌'. టెంపర్‌ చిత్రం తర్వాత పూరికి సరైన సక్సెస్‌ దక్కలేదు. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చాయి. అవకాశాలు రావడమే గగనం అయ్యింది. అలాంటి సమయంలో రామ్‌ ఈయన దర్శకత్వంలో నటించేందుకు ముందుకు రావడంతో సొంత బ్యానర్‌ లో పూరి ఇస్మార్ట్‌ శంకర్‌ ను స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆ చిత్రం దర్శకుడిగా నిర్మాతగా పూరికి చాలా హెల్ప్‌ అయ్యింది. పూరి మళ్లీ పుంజుకునేలా చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 32 కోట్ల షేర్‌ ను దక్కించుకున్న ఈ చిత్రంను తమిళంలో రీమేక్‌ చేసేందుకు అరవ ఫిల్మ్‌ మేకర్స్‌ ఆసక్తిగా ఉన్నారు. పలువురు ఇస్మార్ట్‌ శంకర్‌ రీమేక్‌ రైట్స్‌ కోసం ప్రయత్నాలు చేశారు. చివరకు ఒక మంచి రేటుకు ఈ చిత్రం అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది. ఇక తమిళ ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంలో హీరోగా స్టార్‌ హీరో ధనుష్‌ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళ హీరోల్లో ఈ కథ కేవలం ధనుష్‌ కు అయితేనే బాగుంటుందని.. మాస్‌ లో అతడికి ఉన్న ఫాలోయింగ్‌ కారణంగా ఖచ్చితంగా సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంలో రామ్‌ గతంలో ఎప్పుడు కనిపించని విధంగా చాలా మాస్‌ లుక్‌ లో కనిపించాడు. హైదరాబాద్‌ గల్లీ పోరడి పాత్రలో రామ్‌ చక్కని నటన కనబర్చాడు. అలాంటి పాత్రను ధనుష్‌ ఈజీగా చేస్తాడని.. అందుకే ఈ రీమేక్‌ కు ధనుష్‌ అయితే నూరు శాతం న్యాయం చేస్తాడనే నమ్మకం అందరిలో ఉంది. ప్రస్తుతం గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత ధనుష్‌ ఈ రీమేక్‌ ను మొదలు పెట్టే అవకాశాలున్నాయి.

పూరి గతంలో చేసిన 'టెంపర్‌' చిత్రం తమిళంలో ఈమద్యే 'అయోద్య'గా రీమేక్‌ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. త్వరలో ఇస్మార్ట్‌ శంకర్‌ కూడా తమిళ ఆడియన్స్‌ ముందుకు వెళ్లబోతుంది. రీమేక్‌ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.