Begin typing your search above and press return to search.
క్రేజీ హీరో సినిమాని అలా వదిలేసారా?
By: Tupaki Desk | 6 July 2022 12:29 PM GMTఅక్కినేని నాగచైతన్య ఈ ఏడాది ప్రారంభంలో తండ్రి నాగార్జునతో కలిసి రొమాంటిక్ ఎంటర్ టైనర్ `బంగార్రాజు` తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సూపర్ హిట్ ఫిల్మ్ `సోగ్గాడే చిన్నినాయన`కు సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ సంక్రాంతికి బరిలో నిలిచి ఫరవాలేదని పించింది. అయితే ఆశించి స్థాయిలో మాత్రం అభిమానుల్ని సంతృప్తి పరచలేకపోయింది. దీంతో నాగచైతన్య తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో చైతూ నటిస్తున్న మూవీ `థాంక్యూ`.
స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ముందు ఈ మూవీని జూలై 8న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. డేట్ ని కూడా ప్రకటించారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ సడన్ గా రిలీజ్ డేట్ ని జూలై 22కు మార్చేశారు. అయితే ఈ మూవీకి బజ్ క్రియేట్ కావడం లేదు. మేకర్స్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం లేదని అక్కినేని ఫ్యాన్స్ కామెంట్ లు చేస్తున్నారు.
చై సినిమాకు రావాల్సినంత బజ్ క్రియేట్ కాకపోవడంతో మేకర్స్ కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. హీరో, హీరోయిన్ లతో పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలని ప్లాన్ చేశారు. అవి అనుకున్నంతగా బజ్ ని క్రియేట్ చేయడం లో విఫలమయ్యాయి.
టాలీవుడ్ మార్కెట్ లో దిల్ రాజుని అంతా జనం పల్స్ తెలిసిన జీనియస్ గా అభివర్ణిస్తుంటారు. కానీ ఈ మూవీ విషయంలో అది మాత్రం జరగడం లేదని, ఆయన బ్యానర్ రేంజ్ లో మా హీరో మూవీకి ప్రమోషన్స్ చేయడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు.
ఈ మూవీ సక్పెస్ చాలా మందికి కెరీర్ కి అవసరం. హీరోగా నాగచైతన్యకు, హీరోయిన్ లు రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, అలాగే రైటర్ బీవీఎస్ రవి, డైరెక్టర్ విక్రమ్ కుమార్ కు కూడా ఈ మూవీ సక్సెస్ ప్రధానంగా మారింది. ఇప్పటికైనా సమయం మించిపోలేదని, భారీ స్థాయిలో ప్రమోషన్స్ ని ప్రారంభిస్తే మంచిదని ఫ్యాన్స్ అంటున్నారట.