Begin typing your search above and press return to search.
'బ్రహ్మాస్త్ర' విషయంలో బాయ్ కాట్ పని చేయలేదా?
By: Tupaki Desk | 10 Sep 2022 3:18 PM GMTబాలీవుడ్ ని గత కొన్ని నెలలుగా బాయ్ కాట్ ట్రెండ్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఏ స్టార్ నటించిన సినిమా విడుదలవుతోందన్నా రెండు వారాల ముందుగానే బాయ్ కాట్ గ్యాంగ్ అలర్ట్ అవుతూ సదరు సినిమాపై బాయ్ కాట్ ట్రెండ్ ని వైరల్ చేస్తూ వస్తోంది. అక్షయ్ కుమార్ నటించిన `సామ్రాట్ పృథ్వీరాజ్`, రక్షా బంధన్, రణ్ బీర్ కపూర్ నటించిన `షంషేరా`, అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చడ్డా`.. విజయ్ దేవరకొండ నటించిన `లైగర్` ఈ ట్రెండ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాయి.
దీంతో బాలివుడ్ బాయ్ కాట్ గ్యాంగ్ అంటే మేకర్స్ లో భయం మొదలైంది. దీని ప్రభావం రణ్ బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించిన `బ్రహ్మస్త్ర`పై కూడా బలంగా వుంటుందని అంతా భావించారు. ఎక్కడ ఈ ట్రెండ్ వల్ల సినిమా భారీ స్థాయిలో నష్టపోతుందో అని కంగారు పడ్డారు. కానీ అదేమీ జరగలేదు. దానికి నిదర్శనం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన `బ్రహ్మాస్త్ర` సాధించిన వసూళ్లే అని తెలుస్తోంది.
ఈ సినిమాపై కూడా రెండు వారాల ముందుగానే బాయ్ కాట్ గ్యాంగ్ నెట్టింట హడావిడీ చేసినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం. భారీ స్థాయిలో ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ లభించాయి. దీంతో ఈ సినిమా ఊహించని విధంగా భారీ స్థాయిలో ఓపెనిగ్స్ ని రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. దీంతో బాయ్ కాట్ గ్యాంగ్ `బ్రహ్మాస్త్ర` విషయంలో విఫలమైందని, వారి పాచిక పారలేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
తొలి రోజు ఈ మూవీ భారీ స్థాయిలో ప్రారంభ వసూళ్లని రాబట్టింది. ఇండియా వైడ్ గా రూ. రూ. 35 కోట్లకు మించి వసూళ్లని రాబట్టినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా వైరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ. 75 కోట్లు రాబట్టి నట్టుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హాలీడే లేని సమయంలో ఈ స్థాయి వసూళ్లని రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్ కావడంతో ఈ మూవీ అవలీలగా రూ . 100 కోట్ల మార్కుని దాటడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చడ్డా`.. విజయ్ దేవరకొండ నటించిన `లైగర్` సినిమాల్లో కంటెంట్ లేకపోవడం వల్లే బాయ్ కాట్ గ్యాంగ్ ప్లాన్ పని చేసిందని, ముందు నుంచి `బ్రహ్మాస్త్ర` విషయంలో పాజిటివ్ టాక్ రావడంతో బాయ్ కాట్ గ్యాంగ్ ప్లాన్ పని చేయలేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కంటెంట్ వున్న సినిమాలు బాయ్ కాట్ గ్యాంగ్ కి భయపడాల్సిన పని లేదని తేలిందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.