Begin typing your search above and press return to search.

చెప్పు విసిరినప్పుడు పరువు పోలేదా?

By:  Tupaki Desk   |   2 Aug 2021 7:32 AM GMT
చెప్పు విసిరినప్పుడు పరువు పోలేదా?
X
మంచు విష్ణు హీరోగా నటించిన దేనికైనా రెడీ సినిమాలో బ్రహ్మన సమాజంను కించ పర్చే విధంగా సన్నివేశాలు.. మాటలు ఉన్నాయంటూ అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఆ సమయంలో బ్రహ్మణులకు మద్దతుగా సినిమా ఇండస్ట్రీ నుండి ప్రముఖ రచయిత జొన్నవిత్తుల నిలిచారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో తమ పరువుకు భంగం వాటిల్లింది అంటూ మంచు వారి ఫ్యామిలీ పరువు నష్టం దావా వేసింది. 9 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై ఇప్పుడు మళ్లీ చర్చ మొదలు అయ్యేలా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రచయిత జొన్నవిత్తుల వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు ఫ్యామిలీతో ఆ సమయంలో ఏం జరిగింది.. ఎందుకు పరువు నష్టం దావా వరకు వెళ్లారు అనే విషయాలను సదరు ఇంటర్వ్యూలో రచయిత జొన్నవిత్తుల చెప్పుకొచ్చాడు.

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. తాను రాసిన ఒక పుస్తకంను అచ్చు వేయించేందుకు విజయవాడ వెళ్లాను. అక్కడ ప్రింటింగ్ సమయం పడుతుందని చెప్పడంతో ఆ సమయంలో సినిమాకు వెళ్లాలని అనుకున్నాను. అప్పుడే పక్కన ఉన్న థియేటర్‌ లో ఆ సినిమా ను చూశాడు. సినిమా చూస్తున్న సమయంలో నాకు ఆశ్చర్యం వేసింది. సినిమాలో యజ్ఞం చేసేందుకు బ్రహ్మణులు రాము అంటూ చెప్పిన సమయంలో డబ్బులు పడేస్తే తోక ఊపుకుంటూ వస్తారంటూ చేసిన వ్యాఖ్యలు నాకు బాధ కలిగించింది. బ్రహ్మణ మహిళ విషయంలో కూడా సినిమాలో చెడుగా చూపించారు. వేద పండితులకు సమాజంలో ఉన్న గౌరవం ను తగ్గించే విధంగా అందులో సన్నివేశాలు ఉండటం నన్ను కలచి వేశాయి. అలాంటి పదాలు సన్నివేశాలను బ్రహ్మణుల గురించి ఎలా వాడారో నాకు ఇప్పటికి అర్థం కాలేదు అన్నాడు.

చాలా మంది బ్రహ్మణులు మంచు వారి కుటుంబంకు ఆ సమయంలో పిండ ప్రథానం చేయడంతో పాటు రకరకాలుగా నిరసన కార్యక్రమాలు చేశారు. నేను ఒక ఛానెల్‌ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ సమయంలోనే అవతలి వైపు మోహన్ బాబుకు చెందిన వారు నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో చర్చ సీరియస్గ్‌ గా అయ్యింది. అయితే ఆ సమయంలో నేను తప్పుగా మాట్లాడింది ఏమీ లేదు. బ్రహ్మణ సమాజం పట్ల బాధ్యతతో మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కించపర్చలేదు. అయినా కూడా కొన్ని రోజుల తర్వాత నాకు పరువు నష్టం దావా నోటీసులు వచ్చాయి.

మోహన్‌ బాబు నాకు పరువు నష్టం కలిగించానంటూ నోటీసులు పంపించడం ఆశ్చర్యంకు గురి చేసింది. అంతకు ముందు పరిచయం ఉన్నా కూడా నాతో మాట్లాడకుండానే నోటీసులు పంపించారు. సినిమా ఇండస్ట్రీ నుండి నేను ఒక్కడినే ఆ సినిమా పై విమర్శలు చేశాను అనే ఉద్దేశ్యంతో నాపై మోహన్‌ బాబుకు చెందిన వ్యక్తలు ఆరోపణలు చేయడంతో పాటు పరువు నష్టం దావా వేశారు అంటూ జొన్నవిత్తుల ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ మోహన్‌ బాబు ఈ కేసు విషయమై కోర్టుకు వెళ్లిన సమయంలో ఒక బ్రహ్మణ మహిళ ఆయనపై చెప్పు వేసింది. ఆమె చెప్పు విసరడం కంటే నేను చేసిన వ్యాఖ్యలతో ఎలా పరువు పోయిందో నాకేం అర్థం కాలేదు.

ఆయనపై మహిళ చెప్పు విసిరినప్పుడు పోని పరువు నేను ఏ వ్యాఖ్యలు చేస్తే పరువు పోయిందో ఆయన చెప్పాలంటూ మళ్లీ ఈ వివాదాన్ని జొన్నవిత్తుల రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో అనవసర వివాదంను మళ్లీ రాజేయడం రెండు వైపుల మంచిది కాదు అంటూ కొందరు జొన్నవిత్తులకు సూచిస్తున్నారు. ఈ వివాదం మళ్లీ ఎక్కడకు వెళ్తుందో అంటూ కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.