Begin typing your search above and press return to search.
ప్రేక్షకుల్లో వున్న క్లారిటీ మేకర్స్ లో రాలేదా?
By: Tupaki Desk | 3 Sep 2022 6:39 AM GMTజూన్, జూలై నెల్లో విడుదలైన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలోకి వచ్చేసి అంతే స్పీడుగా డిజాస్టర్ లు అనిపించుకున్నాయి దీంతో ఏంటీ పరిస్థితి? .. ప్రేక్షకులు థియేటర్లకు రారా.. ఓటీటీలకే పరిమితం అవుతారా..? ..సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటీ? అని ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నిర్మాణంలో వున్న సినిమాల పరిస్థితి ఏంటీ? అని ఇండస్ట్రీ వర్గాలు భయపడ్డాయి. అయితే ఆగస్టులో విడుదలై కల్యాణ్ రామ్ 'బింబిసార', దుల్కర్ సల్మాన్ 'సీతారామం' బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచి ఇండస్ట్రీకి సరికొత్త ఊపిరులూదాయి.
ఆ తరువాత ఆగస్టు 13న విడుదలైన నిఖిల్ 'కార్తికేయ 2' కూడా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో మళ్లీ ఇండస్ట్రీకి మంచి రోజులు మొదలయ్యాయని అంతా ఊపరి పీల్చుకున్నారు. అయితే ఈ సినిమాలతో ప్రేక్షకులు ఇండస్ట్రీకి కొత్త సంకేతాలని అందించారు. కంటెంట్ వున్న సినిమాలపై బ్రహ్మరథం పడతామని, స్టార్ కాస్ట్ తో సంబంధం లేదని నిరూపించారు. అంతే కాకుండా నిర్మాతలు, దర్శకులు ప్రమోషన్స్ పై కాకుండా కంటెంట్ పై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
తమకు ఎలాంటి సినిమాలు కావాలో.. ఎలాంటి సినిమాలని ఆదరిస్తామన్న విషయాన్ని ఫుల్ క్లారిటీతో ప్రేక్షకులు స్పష్టం చేశారు. అయితే ప్రేక్షకుల్లో వున్న క్లారిటీ మేకర్స్ లో ఇంకా రాలేదా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 2న శుక్రవారం రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగ రంగ వైభవంగ', 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కె.వి కథ అందించిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో'ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగ రంగ వైభవంగ' రొటీన్ రొమాంటిక్ డ్రామాగా రూపొందితే, 'ఫస్ట్ డే ఫస్ట్ షో' పవన్ కల్యాణ్ 'ఖుషీ'ని అడ్డంపెట్టుకుని పేలవమైన కథతో రూపొందించారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీ చాలా సిల్లీగా వుందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. కొన్ని సీన్ లు ఓవర్ గా అనిపించాయని కూడా కామెంట్ లు చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగ రంగ వైభవంగ' కూడా ఏమంత గొప్పగా లేదు.. రొటీన్ కథే. దీంతో ఈ రెండు సినిమాలని ప్రేక్షకులు తిరస్కరించి మరోసారి టాలీవుడ్ మేకర్స్ కి గట్టి షాకిచ్చారు.
మరీ ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగ రంగ వైభవంగ'పై సెటైర్లు పడుతున్నాయి. 'ఉప్పెన' లాంటి సినిమాతో పరిచయమైన హీరో ఇలాంటి పేలవమైన కథని ఎలా అంగీకరించాడా? అని కామెంట్ లు చేస్తున్నారు. 'రంగ రంగ వైభవంగ' విడుదలైన శుక్రవారం కూడా ఈ మూవీని మించి 'కార్తికేయ 2' వసూళ్లని రాబట్టిందంటే ప్రేక్షకులు ఎంత క్లారిటీతో వున్నారో అర్థం చేసుకోవచ్చు.
కంటెంట్ వుంటే అది ఏ హీరో సినిమా అన్నద్ది ప్రేక్షకుడు పట్టించుకోవడం లేదు. ఆదరిస్తున్నారు.. బ్లాక్ బస్టర్ హిట్ గా మారుస్తున్నారు. ఈ విషయంలో ప్రేక్షకుల్లో వున్న క్లారిటీ మేకర్స్ లో రాకపోతే టాలీవుడ్ మరిన్ని ఫ్లాపులు ఎదుర్కొవడం గ్యారంటీ అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.