Begin typing your search above and press return to search.

మతిపోయే కవరింగ్‌ ఇచ్చిన దీపిక

By:  Tupaki Desk   |   6 July 2016 3:30 PM GMT
మతిపోయే కవరింగ్‌ ఇచ్చిన దీపిక
X
మొన్న స్పెయిన్ లో జరిగిన బాలీవుడ్‌ ఐఫా 2016 వేడుకల్లో.. చాలామంది స్టార్‌ హీరోలూ హీరోయిన్లు పాల్గొన్నారు. వారిలో ప్రియాంక చోప్రా మరియు దీపికా పదుకొనె కూడా ఉన్నారు. ఇండియాలో చూసుకుంటే టాప్‌ రేస్ లో దీపిక ముందుంటే.. హాలీవుడ్ లోమాత్రం ప్రియాంక ఒక రెండు అడుగులు ముందుంది. ఆ రైవల్రీ కారణంగా వీరిద్దరూ కలసి డ్యాన్సు చేయడానికి అంగీకరించలేదు.

ఆ మధ్య రిలీజైన 'బాజీరావ్ మస్తానీ' సినిమాలో పింగాగ పోరీ అంటూ ఒక పాటలో ప్రియాంక - దీపిక కలసి నర్తించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే పాటకు ఐఫా స్టేజీ మీద కూడా డ్యాన్స్ వేయమని నిర్వాహకులు అడిగితే.. నో అని చెప్పిందట దీపిక. ఇదే విషయంపై అప్పట్లో ప్రియాంకను అడిగితే.. ''మీరు ఐఫా ఆర్గనైజర్లను అడగండి'' అంటూ బదులిచ్చింది. ఇక ఇన్నాళ్లకు దీపికను కూడా సేమ్ క్వశ్చన్ అడిగింది మీడియా. అప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా?

''చూడండి.. నాకంటే ప్రియాంక గొప్ప డ్యాన్సర్. ఆమె చేసే అద్భుతమైన ఆ ప్రదర్శన నా కారణంగా పాడవ్వకూడదు. అందుకే వద్దన్నాను. ఇక ఇద్దరినీ కలసి చూడాలని మీకు అనిపిస్తే.. ఓసారి పింగాగ పోరి సాంగ్ డివిడి తెచ్చి ప్లే చేసుకోండి'' అంటూ సెలవిచ్చింది. వావ్‌ వాటే మతిపోయే కవరింగ్‌ దీపిక. అసలు ప్రియాంక్ అండ్‌ దీపిక ఇద్దరూ బీభత్సమైన డ్యాన్సర్లు కానే కాదు. కాకపోతే ప్రొఫెషనల్ రైవల్రీ కారణంగా దీపిక ఇలా వద్దనేసిందనే సంగతి ఎవరికైనా అర్దమవుతోంది.