Begin typing your search above and press return to search.
చరణ్ తో సామానమైన డైట్ డిటాక్స్ ప్రక్రియ!!
By: Tupaki Desk | 23 May 2021 11:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి 60 ప్లస్ ఏజ్ లోనూ చరణ్ అంత ఎనర్జిటిక్ గా నటించేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యువహీరోలకు ఠఫ్ కాంపిటీషన్ గా మారారు. పైగా లుక్ పరంగానూ ఎక్కడా తగ్గడం లేదు. బాస్ ఫ్రేమ్ లోకొస్తే యూత్ ఊగిపోతోంది. ఈ ఏజ్ లో ఆయనలో అంతటి ఎనర్జీ ఎలా సాధ్యమవుతోంది. ఆ ఛేంజోవర్ ఎలా సాధ్యం? ఈ సందేహాలన్నిటినీ కొరటాల తీర్చేశారు.
ఆచార్య చిత్రం కోసం మెగాస్టార్ పూర్తిగా తన లుక్ ని మార్చేశారు. అందుకోసం ఆయన ఈ లాక్ డౌన్ సమయంలో కఠోరంగా శ్రమించారు.
``సైరా తరువాత చిరంజీవి గారు పాత రూపానికి మారడానికి రెండు నెలల విరామం కోరుకున్నారు. అతను డిటాక్స్ సెంటర్ వెల్నెస్ రిసార్ట్ కు వెళ్లి సూపర్ ఫిట్ గా తయారయ్యారు`` అని కొరటాల వెల్లడించారు.
లాక్ డౌన్ సమయంలో మరింతగా ఆయన స్లిమ్ అయ్యారు. తర్వాత చరణ్ తో కలిసి ఆచార్య చిత్రీకరణలో పాల్గొన్నారు. చరణ్ నటించిన రెండు షాట్లను చూశాక మరింత ఫిట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారు. చరణ్ ఉండే అదే కుటీరంలోనే చిరు ఉండేవారు. వారు ఒకరికొకరు చిట్కాలను పంచుకుంటారు. ఒకే ఆహారాన్ని తింటారు. కలిసి పని చేస్తారు. చరణ్ తో కలిసి పనిచేసిన విధానం తప్పుపట్టలేనిది`` అని కోరటాల తెలిపారు.
నిజానికి మే 13న ఆచార్య రిలీజ్ కావాల్సి ఉన్నా పెండింగ్ షూట్ వల్ల కుదరలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ ముగిశాక షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ప్రతిదీ అనుకూలంగా ఉంటే `ఆచార్య` ఆగస్టు 13న విడుదలయ్యేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. కానీ చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.