Begin typing your search above and press return to search.

భాయ్ లిద్దరికీ ఎక్కడ చెడిందో తెలుసా?

By:  Tupaki Desk   |   10 Jun 2016 5:30 AM GMT
భాయ్ లిద్దరికీ ఎక్కడ చెడిందో తెలుసా?
X
బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ - కండలవీరుడు సల్లూభాయ్ లు ఇద్దరూ జాన్ జిగినీ దోస్త్ లు. ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం. ప్రొఫెషనల్ గానే కాకుండా పర్సనల్ గా కూడా ఒకరినొకరు బాగా ఇష్టపడతారు. జైలు శిక్ష పూర్తి చేసుకువచ్చిన సంజయ్ దత్ కు వెల్ కం చెబుతూ తన ఫామ్ హౌజ్ లో గ్రాండ్ పార్టీ ఒకటి అరేంజ్ చేయబోతున్నట్లు కూడా చెప్పిన సల్మాన్.. ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అంతే కాదు.. రీసెంట్ గా ప్రపంచ పర్యావరణ దినం అయిన జూన్ 5నాడు.. ఓ ఈవెంట్ కు సంజయ్ దత్ వస్తున్నాడని తెలిసి, సల్మాన్ ఎగ్గొట్టేశాడు కూడా.

అసలు వీరిద్దరి మధ్య మాటల్లేవని, ఒకరినొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడ్డం లేదనే మాట వాస్తవం. ఇంతగా డిఫరెన్సులు ఎక్కడ వచ్చాయంటే.. సంజయ్ దత్ పై తీసే బయోపిక్ లో రణ్ బీర్ కపూర్ తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పర్ననల్ లైఫ్ లో కత్రినా కైఫ్ ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం.. రణ్ దీప్ అని భావిస్తున్న సల్మాన్.. బయోపిక్ కాస్టింగ్ విషయంలో మరోసారి ఆలోచించాలని చెప్పాడట.

అయితే తన పాత్రను రణ్ దీప్ కపూర్ తో చేయించాలన్న నిర్ణయం దర్శకుడు రాజ్ కుమార్ హిరాణిదే అని.. తను తలదూర్చబోనని తేల్చేశాడట సంజయ్ దత్. అసలు రణ్ దీప్ అంటే మన మున్నాభాయ్ కి బాగా ఇష్టం కూడా. ఈ విషయంపైనే భాయ్ లు ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తి.. ఒకరినొకరు పలకరించుకోని పరిస్థితి వచ్చింది.