Begin typing your search above and press return to search.
‘ధృవ’లో తేడా కనిపిస్తోంది
By: Tupaki Desk | 12 Oct 2016 11:30 AM GMTతెలుగులో ప్రస్తుతం రీమేక్ సినిమాల హవా నడుస్తోంది. దసరా కానుకగా విడుదలై సూపర్ హిట్టయిన ‘ప్రేమమ్’ రీమేకే. ఇంకా తెలుగులో మరిన్ని రీమేకులు తయారవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి.. ఆయన కొడుకు రామ్ చరణ్ కూడా రీమేకుల్లోనే నటిస్తున్నారు ప్రస్తుతం. మరి ‘ప్రేమమ్’ తరహాలో వీటిని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఎలా మారుస్తారో చూడాలి. దసరా రోజు రిలీజైన ‘ధృవ’ టీజర్ చూస్తే దీనికి కూడా తెలుగు టచ్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.
తమిళంలో హీరో జయం రవి ఫిజిక్.. లుక్ విషయంలో అంత కేర్ ఏమీ తీసుకోలేదు. మామూలుగానే కనిపించాడు. కానీ రామ్ చరణ్ మాత్రం పోలీస్ పాత్ర కోసం మేకోవర్ అయిపోయాడు. అంతేకాక హీరో యాటిట్యూడ్ విషయంలో కూడా ఛేంజ్ కోసం ప్రయత్నించినట్లున్నారు. తమిళంలో జయం రవి మరీ సీరియస్ గా.. మూడీగా కనిపిస్తాడు. కానీ రామ్ చరణ్ అలా లేడు. కొంచెం జోవియల్ గా.. స్టైలిష్ కనిపించడానికి ప్రయత్నించినట్లున్నాడు.
స్టోరీ.. స్క్రీన్ ప్లే విషయంలో పెద్దగా మార్పులేమీ చేసినట్లుగా లేరు కానీ.. టేకింగ్ లో మాత్రం మార్పు కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ చాలా రిచ్ గా కనిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్ లో కనిపిస్తున్నాయి. విజువల్స్ చాలా బాగున్నాయి. మరోవైపు విలన్ అరవింద్ స్వామి లుక్ తెలుగు వెర్షన్లో డిఫరెంట్ గా కనిపించేలా ఉంది. తమిళంలో అతను మామూలుగా కనిపిస్తాడు. తెలుగు వెర్షన్ కోసం విగ్గు అదీ పెట్టి భిన్నంగా చూపించే ప్రయత్నం చేసినట్లున్నారు. టీజర్లో అతడి లుక్ నేరుగా చూపించలేదు. వెనుక నుంచి చూపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/