Begin typing your search above and press return to search.
కరుణానిధి - పవన్..ఆ విషయంలో తేడా ఎందుకు?
By: Tupaki Desk | 9 Aug 2018 9:11 AM GMTజనసేన అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనపై వ్యక్తిగత విమర్శలు ఎక్కువైన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల రాజకీయ ప్రస్థానంలో పవన్ ను వ్యక్తిగతంగా...ముఖ్యంగా ఆయన పెళ్లిల్ల గురించి టార్గెట్ చేసిన వారే ఎక్కువ. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని....అటువంటి వ్యక్తి స్త్రీలను ఏం ఉద్ధరిస్తారని పలువురు ఘాటుగా విమర్శించారు. తాజాగా - తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు - కలైజ్ఞర్ కరుణానిధి మృతితో తెలుగునాట - సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చకు తెర లేచింది. కరుణానిధికి ముగ్గురు భార్యలున్నారని....అలాగే పవన్ కూ ముగ్గురు భార్యలున్నారని...అయితే విడాకుల విషయంలో ఇద్దరికీ చాలా వ్యత్యాసం ఉందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మొదటి - రెండవ భార్యలకు కరుణానిధి విడాకులు ఇవ్వకుండానే మూడో పెళ్లి చేసుకున్నారని...పవన్ మాత్రం అందుకు భిన్నంగా....ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాతే...మరొకరిని వివాహం చేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
కరుణానిధికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య ఉండగానే ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మొదటి భార్య చనిపోయింది. అనంతరం - రెండో భార్య అల్జిమర్స్ తో బాధపడుతోంది. ఆ తర్వాత కరుణ ...మూడో వివాహం చేసుకున్నారు. వీరిలో ఏ ఒక్కరికి ఆయన విడాకులు ఇవ్వలేదు. చట్ట ప్రకారం కూడా ఇది నేరం. అదే తరహాలో జెమినీ గణేశన్ కూడా మూడు పెళ్లిల్లు చేసకున్నారు. కానీ, ఆయనను తమిళ ప్రజలు లవర్ బాయ్ గా పిలుచుకుంటారు. అయితే, పొరుగు రాష్ట్రం తమిళనాడుకు భిన్నంగా....తెలుగునాట పవన్ ను పెళ్లిళ్ల విషయంలో టార్గెట్ చేయడంపై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. హిందూ వివాహ చట్టాన్ని గౌరవించిన పవన్...ఒకరికి విడాకులిచ్చిన తర్వాతే....మరొకరిని వివాహం చేసుకున్నారని, కానీ ఆయనపై విమర్శలు ఎందుకు గుప్పిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కరుణలాగే..పవన్ కూడా సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారని....కరుణపై లేని విమర్శలు పవన్ పై ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.