Begin typing your search above and press return to search.
పవన్ సినిమాతో తేడాలు వస్తున్నాయా?
By: Tupaki Desk | 23 Nov 2017 6:57 AM GMTఒక దర్శకుడికి నిర్మాతకి మధ్యన మంచి రిలేషన్ ఉంటె వారి కలయికలో ఏ సినిమా అయినా చాలా పర్ఫెక్ట్ ఉంటుందని సినీ ఇండస్ట్రీలో అందరు బాగా నమ్ముతారు. అయితే ప్రస్తుతం అదే రిలేషన్ ఒక ఇద్దరి మద్య కొనసాగుతోంది. వారు ఎవరో కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ ఎస్. రాదా కృష్ణ( చినబాబు). ప్రస్తుతం టాలీవుడ్ లో వీరి కాంబినేషన్ మంచి ట్రాక్ లో నడుస్తోంది. వీరి కలయికలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి.
జులాయి - సన్ ఆఫ్ సత్యమూర్తి అండ్ అఆ ఈ మూడు సినిమాలు పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడమే కాకుండా మాంచి కలెక్షన్స్ ని కూడా అందుకున్నాయి. అయితే ఇప్పుడు నాలుగోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాను కూడా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గత సినిమాలు నిర్మాతకు లాభాలను ఇచ్చాయి గాని ఎక్కువ స్థాయిలో ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఈ సారి ఎలాగైనా పవన్ సినిమాకి ఎక్కువ స్థాయిలో రాబట్టాలని నిర్మాత చినబాబు ఆలోచిస్తున్నారట.
ఆ సినిమాకి మార్కెట్ చాలానే ఉంది. దీంతో ముందుగానే చినబాబు పక్క ప్రణాళికలతో ప్రమోషన్స్ ని కూడా హై రేంజ్ లో చేసి మినిమమ్ 25 నుంచి 30 కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. బడ్జెట్ కూడా సినిమాకు బాగానే పెట్టారు కాని.. అది అనుకున్నదానికంటే ఓవర్ అయ్యిందట. ప్రస్తుతం సినిమా మార్కెట్ ని బట్టి చూస్తుంటే నష్టాలు ఏమి రావు కాని.. లాభాలు రావేమోనని ఇప్పుడు త్రివిక్రమ్ అండ్ రాధాకృష్ణ కాసింత కంగారుపడుతున్నారట. ఈ సందర్భంలో వారి మధ్యన కూడా కాసినన్ని మనస్పర్ధలు వచ్చినట్లు టాక్.