Begin typing your search above and press return to search.

ఏం నాయనా.. ‘కొత్త’ సినిమాలు కావాలా?

By:  Tupaki Desk   |   19 Nov 2015 5:30 PM GMT
ఏం నాయనా.. ‘కొత్త’ సినిమాలు కావాలా?
X
తెలుగు సినిమాలు చాలా రొటీన్ గా ఉంటాయన్న కంప్లైంట్ ఎప్పట్నంచో ఉంది. ఐతే ఈ మధ్య మన సినిమాల్లో చాలానే మార్పు కనిపిస్తోంది. గత రెండు మూడేళ్లలో చాలా భిన్నమైన సినిమాలు వచ్చాయి. ఐతే ఈ మధ్య ఎక్కువగా రొటీన్ సినిమాలే ఎక్కువైపోయాయి. ఐతే ఈ శుక్రవారం నుంచి వరుసగా కొత్త సినిమాలు వెల్లువెత్తుతున్నాయి.

సుకుమార్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తూ తనే స్వయంగా నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. టీజర్ - ట్రైలర్ - ఆడియో అన్నింట్లోనూ సుకుమార్ మార్కు క్రియేటివిటీ కనిపిస్తోంది. ఈ సినిమా మీద యూత్ ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. శుక్రవారం రాబోతున్న మరో సినిమా ‘చీకటి రాజ్యం’ కూడా డిఫరెంట్ మూవీనే. దీన్ని కమల్ తెలుగులో ప్రత్యేకంగా తీయడం విశేషం. ఇప్పటికే తమిళ వెర్షన్ కు వచ్చిన టాక్ ప్రకారం సినిమా చాలా డిఫరెంటుగా ఉండబోతోందని తెలుస్తోంది.

తర్వాతి వారం కూడా రెండు డిఫరెంట్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి సైజ్ జీరో. ఒబెసిటీ మీద తీసిన ఈ సినిమా ట్రెండీగా - కొత్తగా ఉండబోతోందని దాని ప్రోమోస్ చూస్తేనే అర్థమైంది. దీని ప్రమోషన్లు కూడా భిన్నంగా చేశారు. వచ్చేవారం రాబోయే మరో సినిమా ‘తను నేను’. గోల్కొండ హైస్కూల్ - ఉయ్యాల జంపాల లాంటి భిన్నమైన సినిమాలు తీసిన నిర్మాత రామ్మోహన్ దర్శకుడిగా తీసిన తొలి సినిమా ఇది. డిసెంబరు 4న విడుదలయ్యే ‘శంకరాభరణం’ కూడా డిఫరెంట్ మూవీనే. మొత్తానికి భిన్నమైన సినిమాలు కోరుకునే ప్రేక్షకులు వచ్చే మూడు వారాలు పండగ చేసుకోవచ్చన్నమాట.