Begin typing your search above and press return to search.

బాలీవుడ్ భలే పేర్లు వెతుకుతోందే

By:  Tupaki Desk   |   11 Oct 2017 5:30 PM GMT
బాలీవుడ్ భలే పేర్లు వెతుకుతోందే
X
సినిమా టైటిల్స్ విషయంలో బాలీవుడ్ మిగిలిన భాషలకు కాస్త విభిన్నంగానే ఉంటుంది. చాలా భాషల్లో షార్ట్ నేమ్స్ ను మాత్రమే ప్రిఫర్ చేస్తారు. కానీ బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు కూడా పొడుగాటి పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వైఖరి వేరే భాషల్లో చాలా చాలా తక్కువగా ఉంటుంది. అయితే.. ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది.

విచిత్రమైన సినిమా పేర్లతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే బెహెన్ హోగా తేరీ అంటూ ఓ మూవీ వచ్చింది. ఇందులో శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటించగా.. స్ట్రెయిట్ గా చెప్పాలంటే ఈ టైటిల్ కి అర్ధం 'నీకు చెల్లి అవుతుందిరా' అని చెప్పచ్చు. ఇప్పుడు షాదీ మే జరూర్ ఆనా అంటూ మరో సినిమా వస్తోంది. బ్రూస్ లీ మూవీలో రామ్ చరణ్ కు అక్కగా నటించిన కృతి కర్బందా.. మన టాలీవుడ్ జనాలకు బాగానే దగ్గరైంది. ఈమె హీరోయిన్ గా వస్తున్న సినిమనే షాదీ మే జరూర్ ఆనా. దీనికి అర్ధం.. పెళ్లికి తప్పకుండా రావాలి.

నీకు చెల్లి అవుతుందిరా.. పెళ్లికి తప్పకుండా రండి వంటి సినిమాలు టైటిల్స్ తోనే మొదట జనాలను ఆకట్టుకుంటున్నాయి. అసలు ఇలాంటి విచిత్రమైన టైటిల్స్ పెట్టాలన్న మేకర్స్ ఆలోచనలకు ముందుగా సలాం చేయాల్సిందే. ఇప్పుడు ప్రారంభమైన ఈ కొత్త ట్రెండ్ నుంచి.. భవిష్యత్తులో మరెన్ని విచిత్రమైన టైటిల్స్ పుడతాయో చూడాలి.