Begin typing your search above and press return to search.
బాప్‌రే! ఫ్యానిజంలో ఇన్ని రకాలున్నాయా!!
By: Tupaki Desk | 10 Aug 2015 7:31 AM GMTహీరోలకు అభిమానమే కొండంత అండ. అభిమానులు లేనిదే అంతా శూన్యం. అయితే తెలుగు ప్రేక్షకుల అభిమానం వేరే ఏ ఇతర భాషలతో పోల్చినా పీక్స్ లో ఉంటుంది. హీరోని విపరీతంగా అభిమానించేయడం మనకి మాత్రమే. అందుకే హీరోలంతా మన పరిశ్రమకి రావడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ అభిమానుల్లో కూడా రకరకాలు. ఆ రకాలేంటో ఓ లుక్కేద్దామా?
హీరో లవర్స్: దేవుడి తర్వాత దేవుడు అంతటివాడు మా హీరో అనుకుంటారు. సదరు హీరోగారి సినిమా రిలీజవుతోందంటే 100కోట్లు వసూలు చేయాలని మొక్కుకుంటారు. పిచ్చ అభిమానం అన్నమాట!
యాంటీ ఫ్యాన్స్: తమ హీరో సినిమా తప్ప వేరొక హీరోని అస్సలు ఎంకరేజ్ చేయనంత అభిమానం. వేరే హీరో సినిమా హిట్టయినా ఒప్పుకోనంత మూర్ఖత్వపు అభిమానం అన్నమాట! తమ హీరో గురించి తప్ప ఇతర హీరోల గురించి చెడు ప్రచారం చేయడానికైనా వెనకాడరు. మా హీరోని ఎవరూ అనడానికి సరిపోరని దాడులకు దిగుతారు. ఇదో రకం అభిమానం అన్నమాట!
సినికల్ ఫ్యాన్స్: వీళ్లకు తెలుగు సినిమా ఓ పట్టాన నచ్చదు. ఫలానా హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టినదే కదా! అని తీసి పారేస్తుంటారు. ఫలానా కథ ఎత్తేశారనో, ఫలానా సీన్ లేపేశారనో దెప్పి పొడుస్తుంటారు. ప్రపంచ సినిమాపై ఉన్న పరిజ్ఞానం వల్ల ఇలా అయిపోతారన్నమాట!
సినీ లవర్స్: వీళ్లు ఏ హీరో సినిమా అయినా చూస్తారు. ఈ హీరో, ఆ హీరో అనే తరతమ భేధం ఉండదు. హీరో ఎలా ఉన్నాడు? హీరోయిన్ గ్లామర్ బావుందా? కథ బావుందా? డైలాగ్ నచ్చిందా? ఇలా ఉంటుంది వీళ్ల వ్యవహారం. హీరో, దర్శకుడు, కథ అంటూ మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంటారు.
పైరసీ బ్యాచ్: వీళ్లు సినిమాలకు వీరాభిమానులు. ఫ్యామిలీ తో సినిమాకెళ్లాలంటే వేల కొద్దీ తగలేయాలని భయపడి ఇంట్లోనే ఇంటర్నెట్ లో పైరసీ లో చూసేస్తుంటారు. వచ్చిన ప్రతి సినిమా టిక్కెట్లు కొని చూడలేం అనుకుంటారో ఏమో .. ఎంతకైనా తెగించే రకం అన్నమాట!
యాక్టివిస్ట్స్ ఫ్యాన్స్: సినిమాలపై జనాల్ని మేల్కొలిపే బాధ్యత ఈ అభిమానులది. ఆడవాళ్లను కించపరిచేలా చూపించినా, చరిత్రను వక్రీకరించినా, కులమతాల్ని ప్రస్థావించినా, ఇంకేం చేసినా ప్రతి విషయాన్ని ఆన్ లైన్ లో అభిమానులతో ముచ్చటిస్తుంటారు. చర్చలు కూడా పెడుతుంటారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లను ఆయుధంగా వాడుతుంటారు.
ఇన్ని రకాలుగా ఫ్యాన్స్ ని విడగొట్టి చూడాల్సిందే. ఇప్పుడు సినిమాలు ఎందుకు హిట్టవుతున్నాయ్! ఫట్టవుతున్నాయ్ ! అనేది తెలుస్తుంది.