Begin typing your search above and press return to search.
నేచురల్ స్టార్ కి కష్టమే అన్పిస్తున్న కరోనా కాలం..
By: Tupaki Desk | 11 April 2020 3:00 AM GMTటాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని. కరోనా కారణంగా ప్రస్తుత సినిమాల విడుదల తేదీలను వాయిదా వేసే పనిలో పడ్డారట. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే 'వి' సినిమా విడుదల ఆపేయడం జరిగింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి ఈ నెల విడుదల కావాల్సి ఉంది. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన తదుపరి సినిమా 'టక్ జగదీశ్' గురించి కూడా తెలిపాడు నాని. ఇక హీరోగా చేస్తూనే నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన నాని రెమ్యూనరేషన్ల విషయంలో బాగా ఆరితేరాడట.
ప్రస్తుతం టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న నాని ఇంతవరకు ఆ, హిట్ సినిమాలు నిర్మించి లాభాలను గడించాడు. అయితే నాని ఇంతవరకు చేసిన సినిమాల లో దాదాపుగా అన్నింట్లో పెర్సెంటేజ్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. తాజాగా నాని సినిమాకు 10కోట్ల పారితోషికం తీసుకుంటూనే నాన్ థియేట్రికల్ రైట్స్ లో 60 శాతం వాటా అడుగుతున్నాడని వినికిడి. ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నింట్లో ఇదే తరహా పేమెంట్ తీసుకుంటున్నాడట. తాజాగా కరోనా వలన నాని ఆశలు ఆవిరయ్యాయట. వి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ నుండి బయట పడటం చాలా కష్టం కావడంతో రాబోయే టక్ జగదీష్ సినిమాకి కూడా నాని వెనక్కి తగ్గక తప్పదని తెలుస్తుంది. ఇక సొంతంగా పైకి రావాలనుకునే నాని లాంటి హీరోలకి ఈ కరోనా కాలం కష్టకాలంగా మారనుంది అనేది మాత్రం స్పష్టమవుతుంది.