Begin typing your search above and press return to search.

మెగా ఫిల్మ్ కి అక్క‌డ కూడా క‌ష్టాలేనా?

By:  Tupaki Desk   |   21 May 2022 1:30 PM GMT
మెగా ఫిల్మ్ కి అక్క‌డ కూడా క‌ష్టాలేనా?
X
థియేట‌ర్ల‌లో సంద‌డి చేసిన భారీ చిత్రాలు ఇప్ప‌డు ఓటీటీ వేదిక‌ల్లో మ‌రింత‌గా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే కొన్ని మాత్రం థియేట‌ర్ల‌లో ఎలాంటి ఫ‌లితాన్ని చూశాయో ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌లోనూ అంత‌కు మించి చేతు ఫ‌లితాల్ని ఎదుర్కొంటున్నాయి. ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించిన చిత్రాలు ఓటీటీల్లో విడుద‌ల‌వుతుంటే ఆడియ‌న్స్, ఫ్యాన్స్‌ థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న‌ట్టే సంబ‌రాలు చేసుకుంటున్నారు.

కానీ ఓ సినిమ‌బా ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోనూ నిరాశ ప‌రిచింది. అదే త‌ర‌హ ఫ‌లితాన్ని ఓటీటీలోనూ చ‌విచూస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. దేశ వ్యాప్తంగా ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించిన సినిమాలు ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ 2.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ 'ట్రిపుల్ ఆర్‌'. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ ఇటీవ‌ల విడుద‌లై వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే.

ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా 1100 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిపై తిరుగు బాగు చేసిన ఇద్దరు పోరాట యోధుల ఫిక్ష‌న‌ల్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ దేవ వ్యాప్తంగా హారీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఇక ఈ మూవీ త‌రువాత 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 1'కు సీక్వెల్ గా వ‌చ్చిన చిత్రం 'కేజీఎఫ్ 2'.

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే హిందీలో 400 కోట్లు దాటిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో 1200 కోట్లు రాబ‌ట్టి స‌రికొత్త రికార్డు దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఈ రెండు సినిమాలు ఇటీవ‌ల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆమెజ‌న్ ప్రైమ్ లో 'కేజీఎఫ్ 2', జీ5లో 'ట్రిపుల్ ఆర్‌' స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఈ సినిమాల‌తో పాటు 'ఆచార్య‌' అమెజాన్ ప్రైమ్ లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించ‌గా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రం థియేట‌ర్ల‌లో ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. చిరు కెరీర్ లోనే అత్యంత డిజాస్ట‌ర్ గా నిలిచిన ఈ మూవీకి ఓటీటీలోనూ ఆద‌ర‌ణ ద‌క్క‌డం లేదు. ఓ ప‌క్క ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ 2 లాంటి క్రేజీ చిత్రాల మ‌ధ్య ఓటీటీలో 'ఆచార్య‌'ని చూడ‌టానికి వీక్ష‌కులు ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది.